Breaking News

ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది: మధుబాల

Published on Wed, 04/26/2023 - 18:37

మధు అంటే సినీఇండస్ట్రీలో పెద్దగా గుర్తు పట్టరేమో కానీ.. మధుబాల అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆమె అసలు పేరు మధు అయితే సినిమాల్లోకి వచ్చాక మధుబాలగా మార్చుకుంది. ఆమెకు అంతలా పేరు తీసుకొచ్చిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' మూవీనే. ఆమె  ఒట్టయల్ పట్టాలమ్‌ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో మధుబాల నటించింది. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ మేనక పాత్రలో నటించింది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 14న విడుదలైన ఈ సినిమా ఆశించినా ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా శాకుంతలం సినిమాపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించకపోవడంపై ఆమె తొలిసారి స్పందించారు.

(ఇది చదవండి: సిల్క్ ‍స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!)

మధుబాల మాట్లాడుతూ.. 'కష్టపడి పనిచేసినప్పటికీ శాకుంతలం విజయం సాధించకపోవడం ఎంతగానో బాధపెట్టింది. సినిమా పూర్తయిన తర్వాత ఒక ఏడాది సీజీఐ కోసమే వర్క్‌ చేశారు. ప్రేక్షకులకు మంచి విజువల్‌ ట్రీట్‌ ఇవ్వాలనుకున్నారు. షూటింగ్‌లో నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌పై ఎలాంటి ఒత్తిడి పెంచలేదు.  టాలీవుడ్ చిత్రాలు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ గొప్ప విజయాలు సాధించాయి. వాటి విజయాలకు సరైన కారణం అంటూ ఏదీ లేదు. అవీ ఎలా హిట్ అయ్యాయో అర్ధం కావట్లేదు. మా సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇంతగా నిరాశ పరుస్తుందని మేం అనుకోలేదు.' అని అన్నారు.

కాగా.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సమంత, దేవ్‌ మోహన్, అల్లు అర్హ ప్రధాన పాత్రల్లో నటించారు.   

(ఇది చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌తో పని చేయాలనుంది: హాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌)

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)