Breaking News

జగన్‌ ప్రభంజనానికి కూటమి ఎదురు రాలేదు: నటి, బీజేపీ నేత

Published on Sat, 03/16/2024 - 11:27

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ఏపీ రాజకీయాలపై తాజాగా స్పందించారు. ఒకప్పుడు సినిమాల్లో రాణించిన ఆమె ముక్కుసూటిగా సినిమా ఇండస్ట్రీపై తన అభిప్రాయాన్ని పంచుకోవడంతో పెద్దగా అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు. అయినా కూడా ఆమె వెనక్కు తగ్గలేదు.. తన పంతాను కొనసాగించింది. ఆపై పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లోని  బీజేపీలో కీలకంగా వ్యవహరించారు.

ఏపీలో ఎన్నికల సెగ ప్రారంభమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను నమ్ముకుని తాను సింగిల్‌గానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి గెలుపు రేసులో ముందున్నారు. ఇదే విషయాన్ని అనేక జాతీయ సర్వేలు కూడా వెళ్లడించాయి. మరోవైపు చంద్రబాబు మాత్రం బీజేపీ, జనసేనను నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఇలాంటి సమయంలో ఏపీ రాజకీయాల గురించి మాధవీ లత ఇలా స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నడం వల్ల ఈజీగా గెలిచేద్దాం.. జగన్‌ని ఓడించేద్దాం అంటే అది అంత ఈజీ కాదు.

ఎందుకంటే సీఎం జగన్‌కు చాలా రాజకీయ ప్రణాళికలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రజలకు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చి ఎంతో మేలు చేశారు. దీంతో ఏపీ ఎన్నికల్లో మళ్లీ ఆయనే గెలిచే అవకాశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డబ్బులు భారీగా ఖర్చు పెట్టిన కూడా జగన్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టడం కష్టం. సీఎం జగన్‌ను దెబ్బ కొట్టాలి అంటే చాలా జాగ్రత్తగా మూడు పార్టీలు కష్టపడాలి. మూడు పార్టీలు కలిశాము కదా.. ఇంకేముందిలే అంటే కుదరదు. మూడు పార్టీలకు ఉన్న బలం అంతా కలుపుకుని గ్రౌండ్‌ లెవల్‌ నుంచి నిరంతరం కష్టపడి పనిచేసినా కూటమి గెలిచే అవకాశాలు చాలా తక్కువ.. జగన్‌ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ప్రజలు ఆయన్ను నమ్ముతున్నారు. కూటమిలోని మూడు పార్టీలు కష్టపడి పనిచేసినా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే సీట్లు రావా? అంటే ఖచ్చితంగా టీడీపీ,బీజేపీ, జనసేనలకు సీట్లు వస్తాయి. కానీ గెలుపు వస్తుందా? రాదా?? అధికారం వస్తుందా రాదా?? అనేది చాలా ముఖ్యం. ఉన్న బలం అంతా కూడబలుక్కొని ఎంతో కష్టపడితే తప్పితే సీఎం జగన్‌ని ఎవరూ ఓడించలేరు. అది అంత ఈజీ కాదు. అని  2024 ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, సినీ నటి మాధవీలత తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.

మాధవి లత తెలుగులో నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత  స్నేహితుడా, అరవింద్-2 లాంటి చిత్రాల్లో అలరించిచారు. సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె 2018లో బీజేపీలో చేరారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)