Breaking News

నా పెళ్లి విషయం తెలిసి ఆ హీరో ఏడ్చాడు: ఖుష్బూ

Published on Sun, 07/07/2024 - 09:36

ఒకప్పుడు హీరోయిన్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్న ఖుష్భూ.. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా,టీవీ యాంకర్‌గా బిజీ అయింది. అప్పట్లో ఖుష్భూకి తమిళ్‌లోనే కాదు టాలవుడ్‌లోనూ ఫుల్‌ ప్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్‌ హిట్‌. ఆ తర్వాత తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 200పైగా సినిమాల్లో నటించారు. 

అప్పట్లో తమిళనాడులో అభిమానులు ఖుష్భూకి ఓ గుడినే కట్టించారంటే..ఆమె క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 2000 సంవత్సరంలో డైరెక్టర్‌ సుందర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుందర్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ముఱై మామన్’లో ఖుష్బూ హీరోయిన్‌. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు.ఈ దంపతులకు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ తన పెళ్లిలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను, సుందర్‌ ప్రేమలో ఉన్న విషయం చాలా కాలం పాటు ఎవరికి చెప్పలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోబుతున్నామనే విషయం మొదటగా హీరో కార్తీక్‌కి సుందర్‌ చెప్పాడు. విషయం తెలిసిన వెంటనే కార్తీక్‌ నాకు ఫోన్‌ చేసి సంతోషంగా ఉందంటూ ఎమోషనల్‌ అయ్యారు. అలాగే మా పెళ్లికి కూడా వచ్చాడు. అప్పుడు మేమిద్దరం ఆయన కాళ్లపై నమస్కరించి ఆశిస్సులు తీసుకున్నాం. ఆ సమయంలో కార్తీక్‌ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు’ అని ఖుష్భూ చెప్పుకొచ్చింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)