Breaking News

‘ఓరీ’ దేవుడా.. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడు మేనేజర్‌!

Published on Sat, 03/29/2025 - 14:19

ఓరీ(Orry) అలియాస్ ఓర్హాన్‌ అవత్రమని.. ఈ పేరు బాలీవుడ్‌తో పాటు సోషల్‌ మీడియా ఫాలో అయ్యేవారికి బాగా తెలుసు. బాలీవుడ్‌ తారల పార్టీల్లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ నిలిస్తూ బాగా ఫేమస్‌ అయ్యాడు.  జాన్వీ కపూర్, అనన్య పాండే, సుహానా ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ కిడ్స్‌ పార్టీల్లో మనోడు కచ్చితంగా ఉండాల్సిందే. ఇలా స్టార్స్‌తో కలిసి తిరుగడంతో మనోడికి కూడా ‘స్టార్‌’ హోదా వచ్చేసింది. సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చేంది. 

ఇన్‌స్టాలో ఏ పోస్ట్‌ పెట్టినా ఇట్టే వైరల్‌ అయిపోతుంది. తాజాగా ఈ సోషల్ మీడియా సంచలనం గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇతని మేనేజర్‌గా ఒకప్పటి టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పని చేస్తోంది. ఆమె ఎవరో కాదు ‘ఖడ్గం’ఫేం కిమ్‌ శర్మ(kim sharma).

కిమ్ శర్మ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి, 2000లో 'మొహబ్బతేన్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగు సినిమా 'ఖడ్గం' (2002)లో నటించి మంచి పేరు సంపాదించింది. అయితే, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ఈ అందాల తార సినీ పరిశ్రమకు వీడ్కోలు పలికింది. ఆ తర్వాత ఆమె బిజినెస్ రంగంలోకి ప్రవేశించి, ప్రస్తుతం ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తోంది. 

ఈ సంస్థ సోషల్ మీడియా స్టార్ ఓరీకి సంబంధించినది. కిమ్ శర్మ తన చాకచక్యంతో ఓరీ నికర విలువను రూ. 10 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. ఒకప్పటి హీరోయిన్ నుంచి మేనేజర్‌గా స్థానం మార్చుకున్న ఆమె జీవన ప్రస్థానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు