Breaking News

సంచలన దర్శకుడు, నటుడితో 'కీర్తి సురేష్‌' సినిమా

Published on Fri, 08/22/2025 - 07:41

నటి కీర్తి సురేష్‌ చిన్న బ్రేక్‌ తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు పలు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన బ్యూటీ, తమిళంలో మంచి విజయాన్ని సాధించిన తెరి చిత్ర హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ బేబీ జాన్‌గా విడుదలైన ఆ చిత్రంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే హిందీలో మరో అవకాశం మాత్రం రాలేదు. అదే సమయంలో తన  చిరకాల మిత్రుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఏ భాషలోనూ మరో చిత్రంలో నటించలేదు. ఇది ఆమె కావాలని తీసుకున్న బ్రేకా లేక అవకాశాలు రాక అన్నది తెలియదు గానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. 

ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ ఏర్పాటు చేసుకుని మరి అందమైన ఫోటోలను తీయించుకొని వాటిని సామాజిక మాధ్యమాలలో విడుదల చేస్తూ అభిమానుల్ని ఆనంద పరుస్తున్నారు. కాగా తాజాగా తమిళంలో కొత్త చిత్రానికి కమిట్‌ అయినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే సంచలన దర్శకుడు, నటుడు మిష్కిన్‌తో కలిసి ఈ కొత్త చిత్రంలో నటించడానికి కీర్తి సురేష్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రానికి ఆయన కథ మాత్రమే అందించడమే కాకుండా కీర్తి సురుష్‌తో కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. డిటెక్టివ్‌, పిశాచి వంటి హిట్‌ సినిమాలకు దర్శకుడిగా ఆయన పనిచేశారు. రీసెంట్‌గా వచ్చిన డ్రాగన్‌ సినిమాలో ప్రోఫెసర్‌గా మిస్కిన్‌ నటన తెలుగువారికి కూడా నచ్చింది.

ఆపై చాలా సినిమాల్లో నటుడిగా మెప్పించారు. కాగా వారిద్దరి కలిసి నటించనున్న క్రేజీ చిత్రానికి దర్శకుడు ఎవరు ? కథ ఎలా ఉంటుంది? ఏ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం ఎవరు ? వంటి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉందన్నారు. కాగా ఈ భామ ఇంతకుముందే నటించడానికి అంగీకరించిన రివాల్వర్‌ రీటా, కన్నివెడి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ రెండు ఉమెన్‌ సెంట్రిక్‌ కథాచిత్రాలు అన్నది గమనార్హం.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)