Breaking News

ఒకప్పడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?

Published on Tue, 02/28/2023 - 17:34

కామ్నా జెఠ్మలానీ ఒకప్పడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. పలువురు అగ్రహీరోలతోనూ నటించింది. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబయి భామ. ఆ తర్వాత గోపిచంద్‌తో కలిసి రణంలో కనిపించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కామ్నాకు గుర్తింపు వచ్చింది.

ఆమె మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్‌లో జయం రవి పక్కన నటించింది. ఆ తర్వాత సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్‌ఎంపీ, టాస్, అందమైన అబద్దం, కింగ్, కత్తి కాంతారావు, యాక్షన్ 3డీ, చివరిగా శ్రీ జగద్గురు ఆదిశంకరలో కనిపించింది. ఆ తర్వాత రెండు కన్నడ సినిమాలు కూడా చేసింది.

ముంబయిలో కామ్నా జెఠ్మలానీ పుట్టి పెరిగింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్‌ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ముద్దుగుమ్మ. తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. సినిమాలకు గుడ్‌ బై చెప్పిన కామ్నా తన భర్తకు వ్యాపారంలో తోడుగా ఉంటోంది. ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులోనే నివాసముంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈ అమ్మడుకు అవకాశాలు రావడం కష్టమే. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. వారితో కలిసి కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)