Breaking News

వయసు గురించి ఆలోచించనంటున్న చందమామ

Published on Wed, 01/07/2026 - 06:56

అందం ఆనందం.. ఆనందమే మకరందం అన్నారో మహాకవి. సినీతారలకు, ముఖ్యంగా హీరోయిన్లకు ఇది వర్తిస్తుంది. వారికి అదృష్టం, అభినయంతోపాటు తళతళ మెరిసే మేని అందం కూడా చాలా అవసరం. అది ఉంటే వయసు గురించి గుర్తుకురాదు. హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కూడా అదే అంటోంది.

ఎందుకంటే పెళ్లి, బాబు అంటూ సంసార జీవితంలో మునిగిన కాజల్‌.. సినీజీవితాన్ని కూడా సమపాళ్లలో అనుభవిస్తోంది. కథానాయికగా చందమామగా అలరించినా, మగధీరతో అభినయించినా.. అందాలు ఆరబోసినా ఆమెకే చెల్లింది. పాన్‌ ఇండియా హీరోయిన్‌గా అలరిస్తున్న కాజల్‌ అగర్వాల్‌కు ఇటీవల దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో బాగానే ఉన్నాయి. అక్కడ రామాయణం సినిమాలో మండోదరిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అలాగే ది ఇండియా స్టోరీ అనే మరో మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోందట! ఇప్పటికీ మిలమిల మెరిసిపోతున్న కాజల్‌ తన సౌందర్య రహస్యం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇప్పుడు తన వయసు 40 ఏళ్లని.. సౌందర్యానికి కారణం వర్కవుట్స్‌, యోగా అంది. తాను నిత్యం వర్కవుట్స్‌ చేయడంతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటానంది.

ముఖ్యంగా ఆకుకూరలు, పళ్లరసాలు తీసుకుంటానని పేర్కొంది. కాయగూరల్లో ఉండే పౌష్టికాహారాలు, కొబ్బరి నీళ్లు, పళ్లరసాల్లో ఉండే ప్రకృతి సిద్ధమైన తీపి ద్వారా వెంటనే సత్ఫలితాలు అందుతాయని తెలిపింది. అందువల్ల తాను వయసు గురించి ఆలోచించనని పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)