Breaking News

అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక

Published on Mon, 04/29/2024 - 12:32

ఫిట్‌నెస్ మెంటైన్ చేసే విషయంలో కొందరు హీరోయిన్లు తోపు ఉంటారు. ఎందుకంటే మంచి వయసులో ఉన్న చాలామందికి సాధ్యం కానివి చేసి చూపిస్తుంటారు. ఇక వర్కౌట్ లాంటి వాటితో బాడీని మంచి షేప్‌లో ఉంచుతుంటారు. ఇలాంటి బ్యూటీస్‌లో హీరోయిన్ జ్యోతిక ఒకరు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన మూవీస్ చేస్తూ అలరిస్తున్న ఈమె.. ఇప్పుడు ఏ హీరోయిన్‌కి సాధ్యం కానిది చేసేందుకు రెడీ అయిపోయింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)

ముంబయికి చెందిన జ్యోతిక.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలు చేసింది. హీరో సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత నటన పక్కనపెట్టేసింది. పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్‌గా మంచి దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్న జ్యోతిక.. ఫిట్‌నెస్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. మొన్నీమధ్య భర్త సూర్యతో కలిసి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంది.

ఇకపోతే గతంలో హిమాలయాలు, కశ్మీర్‌లో ట్రెక్కింగ్ చేస్తూ కనిపించిన జ్యోతిక.. ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే బిజీలో ఉంది. ప్రస్తుతం బేస్ క్యాంప్ వరకు వెళ్లిన విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్కడివరకు ఎలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాను. ఏమేం తిన్నాను. అక్కడ వాతావరణం ఎలా ఉంది లాంటి విజువల్స్‌ని రీల్ చేసి పోస్ట్ చేసింది. ఒకవేళ జ్యోతిక గనుక ఎవరెస్ట్ ఎక్కితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్ అయిపోతుంది!

(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)