Breaking News

ఈ పాప తెలుగు హీరోయిన్.. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. ఎవరో కనిపెట్టారా?

Published on Tue, 01/02/2024 - 21:25

ఈమె తెలుగు హీరోయిన్. అంటే పదుల సంఖ్యలో సినిమాలేం చేసేయలేదు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత ఇక్కడ మూవీస్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. దీంతో ఛాన్సులే రావడం మానేశాయి. అయితేనేం బాలీవుడ్‌లో చెక్కేసింది. సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్మే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు ఇషా తల్వార్. అరె.. ఈ పేరు ఎక్కడా గుర్తురావట్లేదే? అని అనుకుంటున్నారా? అస్సలు కంగారు పడకండి. మేం చెప్పేస్తాం. అప్పట్లో 'ఇష్క్' మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన నితిన్.. అదే ఊపులో 'గుండె జారి గల్లంతయ్యిందే' అని మరో మూవీ చేశాడు. ఇందులో నిత్యామేనన్ మంచి స్కోప్ ఉండే పాత్ర చేసింది. అదే టైంలో మరో హీరోయిన్‌గా చేసిన ఇషా తల్వార్ కూడా బాగానే ఫేమ్ తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!)

అయితే నితిన్ మూవీ తర్వాత 'మైనే ప్యార్ కియా', 'రాజా చెయ్యి వేస్తే' అని మరో రెండు సినిమాల్లో ఇషా తల్వార్ హీరోయిన్‌గా చేసింది. కానీ లక్ అన్నదే అస్సలు కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పుడు వరసపెట్టి మలయాళ మూవీస్ చేసింది గానీ టాలీవుడ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మాత్రం పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. 

హీరోయిన్ అనే కాకుండా 'మీర్జాపూర్' లాంటి ఫేమస్ వెబ్ సిరీస్‌లోనూ గుర్తింపు ఉన్న పాత్ర చేసింది. 2023లోనూ సాస్-బాహు ఔర్ ఫ్లెమింగో, చమక్ లాంటి సిరీసుల్లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే అటు మూవీస్ ఇటు సిరీసులు చేసుకుంటూ బండి నడిపేస్తోంది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 36 ఏళ్లు వయసొచ్చినా సరే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?)

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)