Breaking News

నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్‌ కామెంట్‌

Published on Mon, 04/28/2025 - 17:05

కోలీవుడ్‌ హీరో అజిత్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రంతో అజిత్‌ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆపై కొద్దిరోజుల క్రితమే అజిత్, అతని భార్య షాలిని తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో నటి హీరా రాజగోపాల్‌ కూడా తన ప్రేమకథతో పాటు విడిపోవడం గురించి చెబుతూనే తన మాజీ ప్రియుడిపై ఆమె షాకింగ్‌ ఆరోపణలు చేశారు. 1990లో నటి హీరా రాజ్‌గోపాల్‌తో అజిత్‌ నడపిన ప్రేమాయణం అప్పట్లో టాక్‌ ఆప్‌ ది టౌన్‌గా ఉండేది. పలు గొడవల వల్ల బ్రేకప్‌ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు అజిత్‌ పేరును ఆమె ప్రస్తావించకుండానే ఒక నటుడు అంటూ సెన్సేషనల్‌ కామెంట్లు చేశారు.

హీరా రాజగోపాల్ తన బ్లాగులో ఇలా చెప్పుకొచ్చారు.. 'ఒక నటుడు నాకు  ద్రోహం చేయడమే కాకుండా తన అభిమానులతో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశాడు. అతని వల్ల నేను చాలా అవమానంతో పాటు అనేక ఇ‍బ్బందులు  ఎదుర్కోవలసి వచ్చింది. ఒకసారి తన వెన్నెముకకు గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నానని  నాకు చెప్పాడు.. ఆ సమయంలో నేను అతనితోనే ఉండి ఎన్నో సపర్యలు చేశాను. కానీ, అతను ఆరోగ్యం విషయంలో కూడా అబద్ధం చెప్పాడని తర్వాత తెలుసుకున్నాను.' అని హీరా రాసుకొచ్చారు. ఆపై వివాహం గురించి కూడా ఆ నటుడు తనతో చెప్పిన మాటలను ఇలా చెప్పంది 'నేను పనిమనిషిలా కనిపించే స్త్రీని వివాహం చేసుకోబోతున్నాను. అప్పుడు ఎవరూ ఆమెను చూడరు. కానీ, నేను మాత్రం నాకు నచ్చిన స్త్రీతో శృంగారంలో పాల్గొంటాను' అని హీరాతో ఆ నటుడు చెప్పినట్లు తన బ్లాగ్‌లో పోస్ట్‌ చేశారు.

1990లో నటి హీరా రాజ్‌గోపాల్‌తో అజిత్‌ నడపిన ప్రేమాయణం భారీగా వైరల్‌ అయింది. కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్‌ - హీరా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత 'తోడారమ్' అనే మరో చిత్రంలోనూ కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ బంధం పెళ్లిదాకా మాత్రం వెళ్లలేదు. వీరి వివాహానికి హీరా తల్లి నో చెప్పిందని, దీంతో వీరి లవ్‌ స్టోరికి ఫుల్‌స్టాప్‌ పడినట్లు కోలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. కానీ, అజిత్‌నే తనను వదిలించుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. కాగా కొన్నేళ్లకు అజిత్‌.. నటి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అనోష్కా, ఆద్విక్‌ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటిగా కెరియర్‌లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న షాలిని ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. 

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)