Breaking News

'విజయ్ గెలుపునకు.. త్రిషకు సంబంధమేంటి?..' నటి ఆగ్రహం

Published on Thu, 05/07/2026 - 19:12

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే పోటీ చేసిన తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. ఇక విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఓకే కానీ.. విజయ్ గెలిచిన తర్వాత త్రిష పేరు కూడా అదే రేంజ్‌లో వైరలవుతోంది. ఫలితాల రోజు త్రిష బర్త్‌ డే కావడంతో.. ఈ గెలుపును ఆమెకు పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా వీరద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కూడా టాక్ వినిపిస్తోంది. విజయ్ విజయం తర్వాత సీఎం టాపిక్ కంటే..వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ నడుస్తోంది.

విజయ్- త్రిష పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వార్తలపై నటి గాయత్రి శంకర్ స్పందించారు. విజయ్ గెలవడానికి త్రిషనే కారణమని అభినందిస్తున్న వారిని విమర్శించింది. ఒకవేళ పురుషుడి స్థానంలో మహిళ ఉంటే సమాజం ఇలాగే స్పందిస్తుందా అని ప్రశ్నించారు. ఒక నటి తన సహనటుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్లయితే ఏ సమాజం ఇలాంటివీ సహించదని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది.  

త్రిష స్థానంలో పురుషుడు ఉంటే ఈ విషయాన్ని జోక్‌గా తీసుకునేవారు కాదని.. యావత్తు పురుష సమాజం ఆగ్రహంతో రగిలిపోయేదని అన్నారు.  ఆమెను అంతులేకుండా దూషించేవారని గాయత్రి అభిప్రాయపడ్డారు. గెలవడం సంగతి అటుంచితే.. ఆమె తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికే భయపడిపోయేదని గాయత్రి విమర్శించారు. కాగా.. గాయత్రి శంకర్ 'సూపర్ డీలక్స్', 'విక్రమ్' వంటి చిత్రాలతో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. 
 

Videos

సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చరణ్, సుకుమార్ సినిమా..

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండు రోజులు భారీ వర్షాలు

విజయకి కాన్వాయ్ రద్దు DGPపై గవర్నర్ సీరియస్

నడి రోడ్డుపై మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా...

ప్రెస్ మీట్ మధ్యలో ఏడుస్తూ వెళ్లిపోయిన వర్మ...

జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్

చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు

TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్

వస్తావా? నీ రేట్ ఎంత? పోకిరీలకు మిడ్ నైట్ సినిమా చూపించిన లేడీ కమిషనర్

Photos

+5

శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)