Breaking News

నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి

Published on Mon, 08/21/2023 - 14:19

ఐస్‌క్రీమ్‌ 2, ఫిదా, మిఠాయి, అమర్‌ అక్బర్‌ ఆంటోని, కొబ్బరిమట్ట.. ఇలా అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి గుప్తా. అంతకంటే ముందే యాంకర్‌గా, షార్ట్‌ ఫిలింస్‌ చేస్తూ కూడా ఫేమస్‌ అయింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్‌ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలాకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

పదేళ్లపాటు బెడ్‌ రెస్ట్‌..
గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. 'సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. పాతికేళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. నాకు యాంక్లోసింగ్‌ స్పాండిలైటిస్‌ అనే వ్యాధి ఉంది. అది ఎందుకు? ఎలా వచ్చిందో అర్థం కాలేదు. పదేళ్లపాటు బెడ్‌ రెస్ట్‌ తీసుకున్నాను. ఇది డిప్రెషన్‌ వల్ల వచ్చే శారీరక వ్యాధి. ఈ విషయం నాకు ఆరు నెలల క్రితం తెలిసింది. చాలామంది డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం బతకడం కష్టమని మూడేళ్ల కిందట డాక్టర్స్‌ చెప్పారు.

ఊహ తెలిసినప్పటినుంచి రాత్రిళ్లు నిద్ర లేదు
ఊహ తెలిసినప్పటి నుంచి రాత్రిళ్లు సరిగా పడుకోలేదు. డిప్రెషన్‌ వల్లే నాకు నిద్ర దూరమైంది. నెలకు రెండు బయాలాజిక్స్‌ ఇంజక్షన్స్‌ తీసుకున్నాను. ఇంజక్షన్స్‌ వేసుకోకపోతే కదలడానికి కూడా కష్టమయ్యేది. అలాగే విపరతీమైన బ్యాక్‌ పెయిన్‌ ఉండేది. పెయిన్‌ కిల్లర్‌ వేసుకున్న ప్రతిసారి నాకు గుండెదడ వస్తుంది. దాదాపు 10 ఏళ్ల నుంచి తరచూ పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతూనే ఉన్నాను. డాక్టర్స్‌ నేను చనిపోతానని చెప్పినప్పుడు ఈ నొప్పి భరించడం కంటే అదే నయం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటకు వస్తుంటే బతుకుపై ఆశ కలుగుతోంది. సైకాలజీ థెరపీ వచ్చాక ఈ వ్యాధిపై మరింత క్లారిటీ వచ్చింది. సమయానికి పడుకోవడం, యోగా చేయడం.. ఇలా అన్నీ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది గాయత్రి గుప్త.

చదవండి: ఘనంగా బిగ్‌బాస్‌ బ్యూటీ కీర్తి నిశ్చితార్థం.. కాలికి పట్టీలు, చేతికి ఉంగరం తొడుగుతూ..

Videos

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్