Breaking News

స్టార్‌ హీరో వారసుడి నుంచి 'ఫరియా అబ్దుల్లా'కు బిగ్‌ ఆఫర్‌

Published on Fri, 03/28/2025 - 08:05

ఏ రంగంలోనైనా, ఎవరినీ అంచనా వేయలేం. సినిమా తారల విషయంలోనూ అంతే. ఎవరికి ఎప్పుడు? ఏ భాషలో అవకాశాలు వరిస్తాయో చెప్పడం కష్టం. ఫరియా అబ్దుల్లా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ తెలుగమ్మాయి జాతి రత్నాలు అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. అందులో చిట్టి పాత్రలో ఆమె సూపర్‌గా మెప్పించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. దీంతో 'ఫరియా అబ్దుల్లా'(Faria Abdullah) పంట పండినట్లే అవకాశాలు వరుస కడతాయి అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆమెకు అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది. అలా రవితేజతో కలిసి రావణాసుర చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. 

కొంత గ్యాప్‌ తరువాత అల్లరి నరేశ్‌కు జంటగా ఆ ఒక్కటీ అడగొద్దు చిత్రంలో నటించారు. అదీ ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో ఫరియా కోలీవుడ్‌పై దృష్టి సారించారు. ఇక్కడ విజయ్‌ ఆంటోనికి జంటగా వళ్లి మయిల్‌ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఈ చిత్రం విడుదల కాకముందే ఈ అమ్మడిని మరో లక్కీచాన్స్‌ వరించిందన్నది తాజా సమాచారం. విజయ్‌ వారసుడు 'జసన్‌ సంజయ్‌' మెగాఫోన్‌ పట్టిన విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది.

ఇందులో నటించే కథానాయకి ఎవరన్న విషయంపై పలువురు స్టార్‌ హీరోయిన్ల పేరు ప్రచారం అయ్యారు. అలాంటిది చివరికి తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లాకు ఆ అవకాశం దక్కిందని తెలిసింది. కాగా తొలి చిత్రం విడుదలకు ముందే మరో అవకాశం వరించడం ఫరియా అదృష్టమేనని చెప్పాలి. ఈమె నటిస్తున్న వళ్లి మయిల్, తాజాగా విష్ణువిశాల్‌కు జంటగా నటిస్తున్న చిత్రాలు కోలీవుడ్‌లో ఎలాంటి పేరు తెచ్చిపెడతాయో చూడాలి.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)