Breaking News

కమిట్‌మెంట్‌ అడిగేదంతా అంకుల్స్‌ బ్యాచే : నటి షాకింగ్‌ కామెంట్స్‌

Published on Tue, 02/10/2026 - 16:29

క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి ఎస్తర్‌ నోరోన్హా కీలక వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇప్పటికీ కొనసాగుతుందని, కమిట్‌మెంట్‌ ఇస్తేనే చాన్స్‌లు ఇస్తామని చెప్పే దర్శకనిర్మాతలు చాలా మంది ఉన్నారని ఆరోపించింది. ఆడియన్స్‌ మాత్రమే క్యాస్టింగ్‌ కౌచ్‌ని కంట్రోల్‌ చేయగలరని ఎస్తర్‌ చెబుతోంది. ఆమె కీలకపాత్ర పోషించిన చిత్రం అమరావతికి ఆహ్వానం చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై మాట్లాడింది.

పేరు చెప్పరు..
క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇప్పటికే టాలీవుడ్‌లో కొనసాగుతూనే ఉంది. రెండ్రోజుల క్రితమే నాకు ఓ కాల్‌ వచ్చింది. కమిట్‌మెంట్‌కి ఓకేనా అడిగారు. నో చెప్పడంతో వదిలేశారు. చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో నేను కష్టపడి వచ్చాను.. టాలెంట్‌తోనే పైకి వచ్చాను, ఒక్కరు కూడా నన్ను కమిట్‌మెంట్ అడగలేదని చెబుతారు. కానీ అదంతా అబద్దం. చాలా మంది కాంప్రమైజ్‌ అయినవాళ్లే. నటన రానివాళ్లు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఎలా ఉంటారు? వాళ్లకు ఉన్న లోపాన్ని కప్పిపుచ్చాలంటే కమిట్‌మెంట్‌ ఇవ్వాల్సిందే. అయితే ఎవరు అడిగారు అనేది ముందే చెప్పరు. ముందుగా మీడియేటర్‌ ద్వారా కమింట్‌మెంట్‌ గురించి అడిగిస్తారు. ఓకే అంటే రెమ్యునరేషన్‌ ఇలా, లేదంటే అలా చెబుతారు. మనసైడ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే.. అడిగింది ఎవరనే పేరుని చెబుతారు. అందుకే ముందుగానే కమిట్‌మెంట్‌ అడిగింది ఎవరు అని కనిపెట్టలేం.

నా గురించి క్లారిటీ రాలేదు
సినిమాలలో ఎప్పుడు చీరలో కనిపించి.. బయటికి దేవతలా కనిపించేవాళ్లు కూడా అలాంటి పనులు చేస్తారు. అయితే నేను ఏ కేటగిరీలో ఉన్నాను అనేది వారికి  క్లారిటీ రావడం లేదు. కొంతమంది ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడి.. తర్వాత అలాంటి పనులు చేస్తుంటారు. నేను కూడా అదే క్యాటగిరీ అనుకొని కాల్‌ చేస్తుంటారు. ఆడియన్స్‌ కూడా ‘ఈవిడ బాగానే మాట్లాడుతుంది, కానీ ఏదో ఒకటి చేసే ఉంటుందని‘ అనుకుంటారు. అలాంటి వాళ్లు నా ఫిల్మోగ్రఫీ చూడాలి. ఒకవేళ నేను కూడా కమిట్‌మెంట్‌కి ఓకే చెబితే.. ఇన్నేళ్లలో ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా నా దగ్గరకు రాదా? నన్ను జనం ఇంతలా ప్రేమిస్తున్నారు.. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్‌ను ఆదరిస్తున్నారు. ఆడియన్స్, మీడియా సపోర్ట్ నాకుంది. అలాంటప్పుడు ఎందుకు నాకు అవకాశం రాలేదో ఆలోచించాలి.

వాళ్లంతా అంకుల్స్‌ బ్యాచ్‌
ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న యువతరం.. కమిట్‌మెంట్‌ గురించి అడగడం లేదు. వాళ్ల చాలా ఫ్యాషన్‌తో పని చేస్తున్నారు. అలాంటి పనులు చేసేవాళ్లంతా పాత బ్యాచ్‌. వారందరిని నేను అంకుల్స్‌ బ్యాచ్‌ అని పిలుచుకుంటాను. వాళ్ల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మనలోని లోపాలను ఆసరాగా చేసుకొని కమిట్‌మెంట్‌ గురించి అడుగుతారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది కనిపించకుండే చేసే అవకాశం ఆడియన్స్‌కి మాత్రమే ఉంది. వాళ్లు ఫిక్స్‌ అయితే.. ఇక్కడ అలాంటి పనులు జరుగవు. హాలీవుడ్‌, బాలీవుడ్‌లో లాగా.. ఇక్కడ కూడా కాంప్రమైస్‌ అయి నటించే నటీనటులను బ్యాన్‌ చేయాలి. అలాంటి వాళ్లు ఎంత పెద్ద సినిమా చేసినా బాయికాట్‌ చేయాలి. అప్పుడే క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆగిపోతుంది’ అని ఎస్తర్‌ చెప్పుకొచ్చింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)