Breaking News

ఒకేసారి 22 సినిమాలకు సంతకం.. ఆయన అన్న ఒక్క మాటతో!

Published on Wed, 07/03/2024 - 17:49

ఏడాదికి ఐదారు సినిమాలు చేసే హీరోలు సంవత్సరానికోసారో, రెండేళ్లకోసారో బాక్సాఫీస్‌ ముందుకు వస్తున్నారు. హీరోయిన్లు ఒక భాషలో కాకపోతే మరో భాషలో కనిపించి కనువిందు చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌ నటి దివ్య దత్త మాత్రం ఓసారి రెండు, మూడు సినిమాలు కాకుండా ఏకంగా 22 సినిమాలకు సంతకం చేసిందట!

22 సినిమాలు..
అప్పుడు తాను కెరీర్‌లో తారా స్థాయికి చేరుకున్నట్లు ఫీలైందట. కానీ యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌ నిర్మాత ఆదిత్య చోప్రా మాటలతో నేలపైకి దిగివచ్చానని చెప్పుకొచ్చింది. దివ్య దత్త మాట్లాడుతూ.. ఆజ నచ్‌లే (2007) సినిమా రిలీజ్‌కు ముందో, తర్వాతో గుర్తులేదు కానీ ఓసారి ఆదిత్య చోప్రాను కలిశాను. ఏంటి? కెరీర్‌ ఎలా సాగుతోంది? అని అడిగాడు. నేను 22 సినిమాలు చేస్తున్నానని చెప్పాను. తను సంతోషించి మెచ్చుకుంటాడనుకున్నాను. కానీ ఆయన మౌనంగా ఉండిపోయాడు.

నచ్చిన పాత్రల ఎంపికతో..
నాకేమీ అర్థం కాలేదు. నీకు హ్యాపీగా లేదా? అని అడిగాను. అందుకాయన నీకు డబ్బు అవసరం ఉందా? అన్నాడు. లేదన్నాను. నీకు వచ్చిన గుర్తింపును కాపాడుకో.. ఎందుకిన్ని సినిమాలు చేస్తున్నావు? అని ప్రశ్నించాడు. అప్పుడు నాకు విషయం బోధపడింది. ఏది పడితే అది చేస్తూ పోవడం కన్నా నిజంగా నా పాత్రకు ప్రాధాన్యత ఉండి, నాకు నచ్చినవాటినే చేయడం బెటర్‌ అని ఫీలయ్యాను. అలా తర్వాత సెలక్టివ్‌గా పాత్రలు చేసుకుంటూ పోయాను. దానివల్ల నా ‍గ్రాఫ్‌ కూడా మారింది అని దివ్య దత్త చెప్పుకొచ్చింది.

చదవండి: ఆ పాట టైంలో విమర్శలు.. డైమండ్‌ గిఫ్టిచ్చిన జ్యోతిక

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)