Breaking News

కన్నడ స్టార్‌ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి

Published on Sun, 03/09/2025 - 13:42

కన్నడ స్టార్‌ యశ్‌ (Yash), నటి దీపికా దాస్‌ దగ్గరి బంధువులు. వీరిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లవుతారు. కానీ ఎప్పుడూ ఒకరి గురించి మరొకరు పెద్దగా మాట్లాడుకోరు, కలిసి కనిపించరు. దీంతో వీరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? అన్న రూమర్లు కూడా వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది దీపిక. దీపికా దాస్‌ (Deepika Das) ముఖ్య పాత్రలో నటించిన కన్నడ చిత్రం పారు పార్వతి. ఈ మూవీ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

యష్‌తో విభేదాలు
సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె యశ్‌తో విభేదాలున్నాయా? అన్న ప్రశ్నకు స్పందించింది. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మేము బాగానే ఉన్నాం. కాకపోతే వృత్తిపరంగా ఎవరి కెరీర్‌ను వారే నిర్మించుకోవాలనుకున్నాం. సినిమాలను మా మధ్యలోకి రానివ్వం. మాకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. పదేపదే మా బంధాన్ని పబ్లిక్‌లో చెప్పాల్సిన పని లేదన్నది నా అభిప్రాయం.

గోప్యతకే ప్రాధానం
అలాగే నేనేదైనా మంచిపని చేస్తే యశ్‌ నన్ను అభినందిస్తాడు. కానీ దాన్ని పబ్లిసిటీ చేయడం మాకు నచ్చదు. పాజిటివ్‌, నెగెటివ్‌ ఏదైనా కానీ చిన్న వార్త దేశమంతా చుట్టేస్తోంది. అందుకే మా వ్యక్తిగత జీవితాలను గోప్యంగానే ఉంచుకుంటాం, అందరికీ చెప్పాలనుకోం. మా కుటుంబాలు వేర్వేరు ఇళ్లలో నివసిస్తాయి. అందువల్ల ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనే మేము కలుసుకుంటూ ఉంటాం.

సంతోషంగా ఉంది
యశ్‌‌ కన్నడ సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అతడు కొనసాగుతున్న కన్నడ చలనచిత్ర పరిశ్రమ (Sandalwood)లో నేనూ ఉండటం సంతోషంగా భావిస్తున్నాను. అతడు మున్ముందు సాండల్‌వుడ్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాలని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2 సినిమాలతో పాన్‌ ఇండియా లెవల్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న యశ్‌ ప్రస్తుతం టాక్సిక్‌ మూవీ చేస్తున్నాడు.

చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్‌ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)