Breaking News

కోలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా మన తెలుగమ్మాయి

Published on Wed, 07/30/2025 - 07:28

నటి బిందు మాధవి. ఈ పేరు పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు పలు భాషల్లో, చిత్రాల్లో కథానాయికిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పదహారు అణాల తెలుగు అమ్మాయి. తెలుగు బిగ్‌బాస్‌ విన్నర్‌ అయిన బిందు మాధవి.. తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. కళగు, కేడీ బిల్లా కిలాడి రంగా, తమిళుక్కు ఎన్‌ ఒండ్రు అళిక్కవుమ్‌ వంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించారు. అలా 2019 వరకు వరుసగా చిత్రాలు చేసిన బిందు మాధవి ఆ తరువాత కారణాలు ఏమైనా వెండి తెరపై కనిపించలేదు. అలాంటిది మళ్లీ 2024లో మాయన్‌ చిత్రంతో ఒక రకంగా రీ ఎంట్రీ అయ్యారనే చెప్పవచ్చు. 

ప్రస్తుతం బ్లాక్‌ మెయిల్, యారుక్కుమ్‌ అంజాల్‌ పగైవనుక్కు అరుళ్వై మొదలగు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. అందులో ఒకటి బ్లాక్‌ మెయిల్‌. జీవీ ప్రకాష్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఎం.మారన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బ్లాక్‌ మెయిల్‌ చిత్రంలో నటించిన అనుభవం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ప్రతి కళాకారుడు కళాకారుని తమ జీవితాల్లో ఒక మార్పు తీసుకువచ్చే తరుణం కోసం ఎదురుచూస్తూనే ఉంటారన్నారు అదేవిధంగా మహిళలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందడం కోసం సవాళతలను ఎదుర్కొంటారన్నారు. 

అలా దర్శకుడు ఎం మారన్‌ బ్లాక్మెయిల్‌ కథను చెప్పగానే అది తనకు బాగా కనెక్ట్‌ అయిన భావన కలిగిందన్నారు. అది తన కోసమే ఎదురుచూస్తున్న పాత్రగా భావించానన్నారు. దర్శకుడు రాసిన బలమైన , భావోద్వేగాలతో కూడిన ఆ పాత్ర తనలో బాధ్యతను పెంచిందన్నారు. ముఖ్యంగా పలు కథాపాత్రలతో కలిసి తన పాత్ర ఉంటుందన్నారు. జీవీ ప్రకాష్‌ లాంటి అద్భుతమైన నటనను ప్రదర్శించే నటుడుతో కలిసి పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. నటి తేజు అశ్విని ,శ్రీకాంత్‌ తదితర నటీనటులందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారన్నారు భావోద్రేకాలతో కూడిన ఉత్సాహబహితమైన థ్రిల్లర్‌ కథాచిత్రంగా ఉంటుందని నటి బిందు మాధవి పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)