Breaking News

నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Published on Sat, 05/04/2024 - 17:14

సినిమా ఇండస్ట్రీలో వచ్చామా, పనిచేశామా, వెళ్లిపోయామా అనేలా ఉంటారు. మరికొందరు మాత్రం ఊహించని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. భావన అలాంటి హీరోయిన్ అని చెప్పొచ్చు. 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ జీవితంలో కాంట్రవర్సీలు బోలెడు ఉ‍న్నాయి. కిడ్నాప్, లైంగిక దాడికి గురవడం, అబార్షన్ అయిందని రూమర్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన పుకార్ల గురించి స్పందించింది.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు కిడ్నాప్ అయింది. ఓ స్టార్ హీరోని ఈమెని ఎత్తుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కేసులో మలయాళ హీరో దిలీప్‌ని అరెస్ట్ కూడా చేశారు. ఈ రచ్చ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన.. 2018లో నిర్మాత నవీన్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈమె నటించిన 'నడికర్' అనే మలయాళ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. అప్పట్లో తన అబార్షన్ గురించి వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.

'అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలువాలో గర్భస్రావం అయిందని, కొచ్చి-చెన్నైలోనూ అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. ఇలా పలుమార్లు జరగడం వల్ల నేను చనిపోయానని కూడా మాట్లాడారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే చిరాకేస్తోంది. అప్పుడు నా గురించి వచ్చిన రూమర్స్ విని మెంటల్‌గా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్‌గా నిలబడ్డాను' అని భావన చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్‌పై స్పందించిన న‌టి)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)