Breaking News

పర్సనల్‌ విషయాల్లో తలదూర్చాడు.. వార్నింగ్‌ ఇచ్చా: నటి

Published on Sun, 06/22/2025 - 14:17

నటి అష్మిత (Ashmita karnani).. ఇటు బుల్లితెర, అటు వెండితెరపైనా రాణించింది. బాబీ, వర్షం, మధుమాసం, మురారి, ఓం నమో వెంకటేశాయ, కాటమరాయుడు, అతిథి.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై చంద్రముఖి, ముద్దు బిడ్డ, ఆకాశగంగ, శ్రావణ సమీరాలు, మనసు మమత, అగ్నిసాక్షి, మధుమాసం వంటి సీరియల్స్‌ చేసింది. చాలాకాలం కిందటే నటనకు గుడ్‌బై చెప్పేసి యూట్యూబ్‌ వీడియోలు చేసుకుంటూ వస్తోంది. ఇటీవల యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన వీడియోలో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది.

నన్నే చూస్తూ..
నా అసిస్టెంట్‌ ఊరెళ్లినప్పుడు మరో వ్యక్తిని అతడి స్థానంలో పెట్టి వెళ్లాడు. అతడు సిన్సియర్‌గానే ఉండేవాడు. కానీ రానురానూ తనకు నాపై పొజెసివ్‌నెస్‌ మొదలైంది. ఎప్పుడూ నాకు ఎదురుగా నిలబడి నన్నే చూస్తూ ఉండేవాడు. ఓసారి అతడిని ఫ్రూట్స్‌ తీసుకురమ్మని చెప్పాను. సెట్‌లో మేము ఏది తెచ్చుకున్నా అందరం పంచుకునేవాళ్లం. అలా ఆ ఫ్రూట్స్‌ను అందరితో షేర్‌ చేసుకున్నాను. అది చూసి ఫ్రస్టేట్‌ అయిపోయేవాడు. ఒకరోజు కోపంతో పిలిచి.. మేడమ్‌, నేను మీకోసం పండ్లు తీసుకొస్తే వాళ్లకిస్తున్నారేంటి? అని నిలదీశాడు. 

జోక్యం చేసుకోవద్దని వార్నింగ్‌
నీ పని నువ్వు చూసుకో.. నేను వాళ్లకిస్తా, వాళ్లు నాకిస్తారు. మధ్యలో నీకేంటి సమస్య? అని తిట్టాను. మరో రోజు ఓ నటి మిస్‌డ్‌ కాల్‌ ఉంటే.. ఫోన్‌ చేయబోయాను. ఇంతలో అతడు.. ఆమెకు ఫోన్‌ చేయొద్దు, ఆమె నన్ను ఏంట్రా?.. అని పిలుస్తుందని అభ్యంతరం చెప్పాడు. నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని మళ్లీ వార్నింగ్‌ ఇచ్చాను. మరో రోజు నా ఫ్రెండ్‌తో చాలాసార్లు ఫోన్‌ మాట్లాడాను. అది గమనించిన అతడు నా ఫోన్‌లో నెంబర్‌ తీసుకుని ఫోన్‌బూత్‌లో నుంచి కాల్‌ చేశాడు. మీరెవరు? ఎక్కడి నుంచి ఫోన్‌ చేస్తున్నారు? అని ప్రశ్నించాడు. 

పనిలో నుంచి తీసేశా
ఆ తర్వాత షూటింగ్‌ లేకపోయినా నాకు ఫోన్లు చేసేవాడు. నాకు కాల్‌ చేయొద్దని కరాఖండి చెప్పాను. అతడి సైకోనెస్‌ చూసి రేపటినుంచి రావొద్దంటూ మరో అసిస్టెంట్‌ను పెట్టుకున్నాను. తీరా సెట్‌కు వెళ్లాక అక్కడి కాస్ట్యూమ్‌ డిజైనర్‌.. అతడిని అసిస్టెంట్‌గా తీసేయొద్దు అని బతిమాలుతున్నారు. అరె, మీ బాధేంటి? అని అడిగితే.. మేడమ్‌కు మీరైనా సర్ది చెప్పండి అంటూ రాత్రంతా ఆయన ఇంటిముందు ఏడ్చుకుంటూ ఉన్నాడట! వారం రోజులపాటు అదే పని చేశాడు. తర్వాత ఇక రాలేదట.. మేకప్‌ ఆర్టిస్ట్‌గా సెటిలయ్యాడని విన్నాను.

అతడొస్తే నేను రాను
ఇండస్ట్రీలో ఓ నటుడు నన్ను ప్రేమించాడు. నేను కాల్‌ చేస్తే ఐ లవ్యూ అష్మిత అని రింగయ్యేది. చెత్తగా అనిపించేది. నాకతను అస్సలు నచ్చేవాడు కాదు. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అతడే రూమర్లు సృష్టించాడు. ఆ విషయం నాకు తెలిసింది. ఓ షో​కి నాతో పాటు ఆ నటుడిని కూడా పిలిచారు. అతడొస్తే నేను రానని చెప్పేశాను. ఇప్పటికే పుకార్లు ఎక్కువయ్యాయి. కాబట్టి ఇప్పట్లో మీతో కలిసి ఏ ప్రాజెక్టులూ చేయనని చెప్పేశాను. అప్పటికే నేను కొరియోగ్రాఫర్‌ సుధీర్‌తో లవ్‌లో ఉన్నాను అని పేర్కొంది. తర్వాత సుధీర్‌నే పెళ్లి చేసుకుని సెటిలైంది అష్మిత.

చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)