Breaking News

మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా?.. విద్యార్థిపై నటి ఆగ్రహం

Published on Fri, 01/20/2023 - 20:15

‘సూరారై పోట్రు’(తెలుగులో ఆకాశమే హద్దురా) చిత్రంతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న యలయాళ భామ అపర్ణా బాలమురళీ. తమిళ స్టార్‌ హీరో​ సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అపర్ణా కథానాయికగా నటించింది. ఇందులో ఆమె తన అద్భుతన నటనకు గానూ ఆమెను నేషనల్‌ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్‌లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమెతో ఎర్నాకులంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. ఆ  వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తాజాగా మలయాళ భామ అపర్ణ విద్యార్థి తీరుపై స్పందించింది. ఈ సంఘటన తనను ఎంతగానో బాధించిందని తెలిపింది. ఈ విషయంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

అపర్ణ మాట్లాడుతూ.. 'తనను బలవంతంగా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరైంది కాదు. అతని చేతులు నా భుజాలపై వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఈ సంఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసే ఉద్దేశం నాకు లేదు. అంత టైం కుడా లేదు. అయితే ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణ చెప్పారని ఆమె వివరించారు. తన కొత్త మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కేరళలోని లా కాలేజీలో తన్కమ్‌ మూవీ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో మూవీ దర్శకుడు, హీరో వినీత్‌ శ్రీనివాసన్‌తో పాటు అపర్ణ కూడా పాల్గొంది.

క్షమాపణలు కోరిన విద్యార్థి సంఘం

అయితే ఈ సంఘటనపై ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాల విద్యార్థి సంఘం విచారం వ్యక్తం చేసింది. దీనిపై క్యాంపస్ యూనియన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో విద్యార్థి సంఘం ఓ నోట్ విడుదల చేసింది. లా కాలేజీలో నటిపై ఇలాంటి సంఘటన జరగడం చాలా విచారకరం అంటూ యూనియన్ తరపున విచారం వ్యక్తం చేశారు. అయితే యూనియన్ ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకుందని.. సదరు విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)