Breaking News

అందరిముందు అలా అనేసరికి షాకయ్యా!: హీరోయిన్‌

Published on Mon, 09/15/2025 - 12:50

సన్నగా ఉంటే అస్థి పంజరంలా ఉన్నావని, బొద్దుగా ఉంటే బాగా లావైపోయావని ఏదో ఒకరకంగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. తనను కూడా ఇలాంటి కామెంట్లతో బాడీ షేమింగ్‌ చేశారంటోంది మలయాళ హీరోయిన్‌ అపర్ణ బాలమురళి (Aparna Balamurali). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొందరు అదే పనిగా ఏదేదో వాగుతారు. ఏం చేస్తున్నావ్‌? ఇలా అయిపోతున్నావ్‌? అని కామెంట్లు చేస్తుంటారు. 

లెక్క చేయట్లే
మొదట్లో ఫీలయ్యేదాన్ని. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లేది. కానీ ఇప్పుడవేవీ పట్టించుకోవడం లేదు. ఇలా ధృడంగా మారడానికి నాకు చాలా సమయం పట్టింది. ఒకసారేమైందంటే.. చాలాదూరం ప్రయాణించి విమానాశ్రయంలో దిగాను. ఇంతలో సడన్‌గా నాకు పరిచయమే లేని వ్యక్తి ఎదురొచ్చి.. ఏంటి? ఇంత లావైపోయావ్‌? అన్నాడు. 

షాకయ్యా
అందరి ముందు సడన్‌గా అలా అనేసరికి షాకయ్యాను. తర్వాత ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయాను. ఇలాంటివి జరిగినప్పుడు మనసుకు కష్టంగా అనిపించేది. కానీ, ఒకానొక సమయంలో ఈ బాధను అధిగమించాను. ఇప్పుడలాంటి కామెంట్లను పట్టించుకోవడమే మానేశాను అని చెప్పుకొచ్చింది. 

సినిమా
అపర్ణ బాలమురళి 2015లో ఒరు సెకండ్‌ క్లాస్‌ యాత్ర అనే మలయాళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సూరరై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాతో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. మలయాళంలో సండే హాలీడే, 2018, ధూమం, రుధిరం వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 8 తొట్టకాల్‌, వీట్ల విశేషం, రాయన్‌ సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో మూడు సినిమాలు చేస్తోంది.

చదవండి: 'మిరాయ్‌' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)