Breaking News

విడాకులు తీసుకున్న బుల్లితెర జంట

Published on Sun, 01/25/2026 - 13:19

బుల్లితెర నటి అనూష హెగ్డే భర్త, నటుడు ప్రతాప్‌ సింగ్‌తో చాలాకాలం దూరంగా ఉంటోంది. వీరిద్దరికీ విడాకులయ్యాయా? అన్న అనుమానాలకు ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది అనూష. నా వైవాహిక జీవితంలో 2023 తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో మీ అందరికీ తెలుసు. మేమిద్దరం చట్టపరంగా 2025లోనే విడిపోయాం అని తెలియజేయడానికే ఈ పోస్ట్‌..

అధ్యాయం ముగిసింది
దీనిపై ఎటువంటి చర్చ పెట్టొద్దని కోరుతున్నాను. మీ ప్రేమాభిమానాలకు, అందిస్తున్న సపోర్ట్‌కు కృతజ్ఞతలు అని పేర్కొంది. పరస్పర అంగీకారంతోనే తన జీవితంలో ఈ అధ్యాయం ముగిసిందని తెలిపింది. ప్రస్తుతం తన కుటుంబం, కెరీర్‌, మానసిక ప్రశాంతతపైనే దృష్టిపెట్టినట్లు రాసుకొచ్చింది.

సీరియల్‌లో జంటగా..
అనూష హెగ్డే, ప్రతాప్‌ సింగ్‌ 'నిన్నే పెళ్లాడతా' సీరియల్‌లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో 2020 ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. అదే నెలలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు మొదలయ్యాయి. చివరకు దంపతులిద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు.

సీరియల్‌, సినిమా
తెలుగు నటుడు ప్రతాప్‌ సింగ్‌.. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు ఇలా పలు సీరియల్స్‌ చేశాడు. ముద్దపప్పు ఆవకాయ వెబ్‌ సిరీస్‌లో నిహారికకు జోడీగా యాక్ట్‌ చేశాడు. బేవర్స్‌ సినిమాలోనూ నటించాడు. అనూష హెగ్డే విషయానికి వస్తే సూర్యకాంతం సీరియల్‌లో యాక్ట్‌ చేసిన ఈ నటికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ బుల్లితెరపై సెటిలైంది.

 

 

చదవండి: ఓటీటీలో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే మూవీ.. సిరై రివ్యూ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)