Breaking News

'ప్రభాస్‌'కు కేక్‌ తినిపిస్తున్న ఆమె ఎవరో గుర్తుపట్టారా?

Published on Thu, 10/23/2025 - 09:27

ఇండియన్‌ పాపులర్‌ యాక్టర్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన రెండో చిత్రం రాఘవేంద్ర హీరోయిన్‌ అన్షు కూడా బర్త్‌డే విషెష్‌ తెలిపింది. ప్రభాస్‌తో దిగిన ఫోటోలను ఆమె షేర్‌ చేసింది. యూకేలో పుట్టి పెరిగిన అన్షు.. 15 ఏళ్లకే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. నాగార్జున 'మన్మథుడు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె తొలి మూవీతోనే భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత ప్రభాస్‌తో రెండో సినిమా  రాఘవేంద్రలో కనిపించింది.

రాఘవేంద్ర సినిమా తర్వాత 2003లో చివరగా మిస్సమ్మలో అన్షు నటించింది. అయితే, సుమారు 22ఏళ్ల తర్వాత తెలుగులో 'మజాకా' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. సైకాలజీలో మాస్టర్స్ చేసి యూకేలో సొంతంగా క్లినిక్ పెట్టుకున్న ఆమె.. 2011లో 24 ఏళ్ల వయసులోనే సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడం.. ఆపై చదువు పరంగా ఇబ్బంది ఉంటుందని ఇండస్ట్రీ నుంచి దూరం జరిగినట్లు ఆమె చెప్పింది. తర్వాత సైకాలజిస్ట్‌గా స్థరపడ్డాక పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అలా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని గుర్తుచేసుకుంది. ఇప్పుడు తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొంది. తాజాగా ప్రభాస్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలు షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్‌తో పాటు అన్షు, శ్వేతా అగర్వాల్ నటించారు. ఇందులో సిమ్రాన్ తొలిసారి ఒక ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.  ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)