Breaking News

ప్రైవేట్ పార్ట్స్‌ ఫొటోలు తీసి పంపుతున్నారు.. ప్రముఖ నటి ఆవేదన!

Published on Sat, 04/22/2023 - 08:46

తమిళ నటి, పలు తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య భాస్కరన్. సీనియర్ నటి లక్ష్మి కూతురు అయిన ఐశ్వర్య టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అమ్మానాన్న తమిళ అమ్మాయి, నాని, కళ్యాణ వైభోగం లాంటి సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌తో మెప్పించింది. అయితే తాజాగా తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించింది.

ఇటీవల తాను ఆన్‌లైన్‌ లైంగిక వేధింపులకు గురయ్యానని ఐశ్వర్య తెలిపింది. చాలా మంది తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతో డిప్రెషన్‌కు గురైనట్లు పేర్కొంది. కూతురి సలహాతోనే ఈ విషయాన్ని మీ అందరితో చెబుతున్నానని వివరించింది. కొందరు వ్యక్తులు అశ్లీల ఫొటోలు పంపిస్తూ తనను మానసికంగా వేధించారంటూ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో సోప్స్ బిజినెస్‌ను ఆమె ప్రారంభించారు. 

ఐశ్వర్య మాట్లాడుతూ..'సోప్ బిజినెస్ కోసం సోషల్ మీడియాలో ఫోన్ నంబర్‌ షేర్ చేశా. అప్పటి నుంచి తనకు అనుచిత సందేశాలు, అసభ్యకర ఫొటోలు పంపిస్తున్నారు. కొంతమంది పురుషులు ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు కూడా షేర్ చేశారు. దీంతో మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యాను.' అంటూ తనకెదురైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో ద్వారా పంచుకున్నారు ఐశ్వర్య. ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వీడియో ద్వారా హెచ్చరించారు.

ఈ విషయంలో ఆమెకు చాలా మంది నెటిజన్లు మద్దతుగా నిలిచారు. కాగా.. ఐశ్వర్య భాస్కరన్ దక్షిణాదిలో తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. అడవిలో అభిమన్యుడు చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)