Breaking News

ప్రేమలేఖలన్నీ చిత్తు కాగితాలు! 38 ఏళ్లుగా అతడే ఊపిరిగా..

Published on Mon, 12/29/2025 - 17:44

కేరళ నటి అభిరామి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలు చేసింది. తెలుగులో థాంక్యూ సుబ్బారావు, చార్మినార్‌, చెప్పవే చిరుగాలి, లెవన్‌, 12ఎ రైల్వే కాలనీ, సరిపోదా శనివారం వంటి పలు సినిమాల్లో యాక్ట్‌ చేసింది. ఇటీవలే ఈ నటి పెళ్లిరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫోటోలు షేర్‌ చేసింది.

ఇప్పటికీ.. ఎప్పటికీ..
'హ్యాపీ యానివర్సరీ మై లవ్‌.. 14వ ఏట నుంచి ఇప్పటి (42వ ఏట) వరకు నా సుఖదుఃఖాల్ని, జయాపజయాలను, భయాలను, ఆశనిరాశలను అన్నింటినీ నీతోనే పంచుకున్నాను, ఇకమీదట  కూడా  పంచుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఆప్తమిత్రుడిగా నిలబడ్డందుకు థాంక్యూ.. నీ ఊహకందనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను' అని నటి రాసుకొచ్చింది.

ప్రేమ ఎలా మొదలైందంటే?
కేరళ తిరువనంతపురానికి చెందిన అభిరామి తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు. వారికి అభిరామి ఒక్కరే సంతానం. స్కూల్‌ పక్కనే వీరి ఇల్లు ఉండేది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే చాలామంది అభిరామికి ప్రేమలేఖలు రాసి పంపేవారు. కొందరైతే నేరుగా ఇంటికొచ్చేవారు. కానీ ఎవరి ప్రేమను యాక్సెప్ట్‌ చేయలేదు నటి. అయితే తనకు స్కూల్‌లో ఓ స్నేహితుడు ఉండేవాడు. అతడే రాహుల్‌. ప్రముఖ రచయిత పవన్‌ మనవడే రాహుల్‌.

అలా మళ్లీ కలిశారు
వీరిద్దరూ స్కూల్‌ డేస్‌ నుంచే మంచి మిత్రులు. తర్వాత పై చదువుల కోసం అభిరామి అమెరికా వెళ్లిపోయింది. కొంతకాలానికి రాహుల్‌ కూడా యూఎస్‌ వెళ్లాడు. అలా మళ్లీ ఇద్దరూ కలిశారు. ఈసారి స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. ఆ ప్రేమను జీవితాంతం పదిలంగా కాపాడుకునేందుకు పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. 2023లో ఈ జంట ఓ పాపను దత్తత తీసుకుంది. తనకు కల్కి అని నామకరణం చేసి పెంచుకుంటున్నారు.

చదవండి: అల్లు శిరీష్‌ పెళ్లి.. సరిగ్గా ఆ హీరోకి ప్రత్యేకమైన రోజే..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)