Breaking News

ఈ హీరోయిన్‌ పుట్టుకతోనే మూగ, చెవిటి.. లేచి నడవలేకపోయింది..

Published on Wed, 08/16/2023 - 17:04

దేవుడు అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో తక్కువైందని కొందరు భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. జీవితంలో సక్సెస్‌ అయితే తమ కష్టం వల్లే అది సాధ్యమైందని, లేదంటే ఎవరి కన్ను తమపై పడిందోనని తిట్టిపోస్తుంటారు. ఇలాంటివారు మన చుట్టూ బోలెడంతమంది కనిపిస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక లోపంతో పుట్టినవారు అలా తిట్టుకుంటూ కాలక్షేపం చేయడానికి బదులు జీవిత పోరాటం చేస్తారు. కష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగుతుంటారు. తమకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకుంటారు. అలాంటివారిలో ఒకరే హీరోయిన్‌ అభినయ.

మాట్లాడలేదు, కానీ..
పేరుకు తగ్గట్లుగానే అభినయంలో ఆమెకు వంక పెట్టడానికి లేదు. కానీ పుట్టుకతోనే ఆమె చెవిటి, మూగ. దానికి తోడు ప్రోటీన్స్‌ లోపం వల్ల మూడేళ్ల వరకు లేచి నడవలేకపోయింది. అయినా ఆమె కుంగిపోలేదు. తన మైనస్‌లనే ప్లస్‌గా మార్చుకుంది. మాట్లాడలేకపోయినా, ఏమీ వినబడకపోయినా ఎదుటివారి పెదాల కదలికను బట్టి వారు ఏం మాట్లాడుతున్నారో ఇట్టే పసిగట్టేస్తుంది. పాత్రలకనుగుణంగా హావభావాలను వ్యక్తీకరించగలుగుతుంది.

రిజెక్ట్‌ చేసిన డైరెక్టర్‌
'నేనింతే' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది అభినయ. టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, హిందీలో బోలెడన్ని సినిమాలు చేసింది. అయితే కోలీవుడ్‌లో ఆమె ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. 'నాడోడిగల్‌' సినిమాకు అభినయ ఫోటోను చూసిన డైరెక్టర్‌ సముద్రఖని ఆమెను వెంటనే ఓకే చేశాడు. అయితే ఆమె మూగ, చెవిటి అని తెలియడంతో వద్దని చెప్పి ముంబై నుంచి ఓ హీరోయిన్‌ను తీసుకొచ్చాడు. తీరా ఆమె సెట్‌లో ఈ తమిళ భాష ఏంటోనంటూ చిరాకు పడి చివరకు చేయనని చెప్పేసింది. దీంతో డైరెక్టర్‌ మాటలు రాకపోయిన అభినయతోనే సినిమా తీయాలని ఫిక్సయ్యాడు.

సౌత్‌ టు హాలీవుడ్‌
కట్‌ చేస్తే సినిమా సూపర్‌ హిట్‌. పదికిపైగా అవార్డులు వచ్చిపడ్డాయి. ఈ సినిమా తెలుగులో శంభో శివ శంభోగా రిలీజైంది. అభినయ భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు చేసింది. తన కెరీర్‌లో ఉత్తమ సహాయ నటిగా పలు అవార్డులు సైతం అందుకుంది. ఆమె ఇక్కడితోనే పరిమితం కాలేదు. హాలీవుడ్‌లో ఒన్‌ లిటిల్‌ ఫింగర్‌ అనే సినిమా సైతం చేసింది. తనలోని వైకల్యాన్ని చూసి బాధపడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె మార్క్‌ ఆంటోని సినిమాలో నటిస్తోంది.

చదవండి: స్టేజీపై విజయ్‌, సామ్‌ రొమాంటిక్‌ డ్యాన్స్‌.. అది సరే కానీ రౌడీ హీరో ఏంటి? మరీ..

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)