Breaking News

ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్‌

Published on Sat, 03/29/2025 - 13:10

టాలీవుడ్‌లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్‌, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో అభినయకు ఛాన్సులు వచ్చాయి.

త్వరలో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నానని కాబోయే భర్తతో కలిసి గుడిగంట కొడుతోన్న ఫొటోను అభినయ పంచుకుంది.  ఈ క్రమంలోనే మార్చి 9న తమ నిశ్చితార్థం జరిగినట్లు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఆమె ఫోటోలు షేర్‌ చేసింది. అతని పేరు 'సన్నీ వర్మ' అని తెలిపింది. ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లు, భవనాలు, నీటిపారుదల, ఎలక్ట్రికల్, మైనింగ్, రైల్వేల నిర్మాణంలో భాగమైన ఒక అంతర్జాతీయ సంస్థలో అతను పనిచేస్తున్నట్లు సమాచారం.

కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ తన ప్రేమను మొదటిసారి ఇలా రివీల్‌ చేసింది. 'నా చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌లో ఉన్నాను.  15 ఏళ్లుగా మా మధ్య బంధం ఉంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నా వ్యక్తిగత విషయం ఏదైనా సరే ఎలాంటి భయం లేకుండా అతనితో  పంచుకోగలను' అని పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)