Breaking News

23 ఏళ్లుగా సినిమాలకు దూరం.. స్టార్‌ హీరోతో పెళ్లి ఆపై రూ. 300 కోట్లతో..

Published on Thu, 06/06/2024 - 13:33

కోలీవుడ్‌ హీరోయిన్‌ షాలిని చిన్నప్పటి నుంచి తన చురుకైన నటనతో అభిమానులను కట్టిపడేసింది. చిన్న వయసులోనే తమిళం, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల్లో బాలతారగా నటించిన షాలినిని బేబీ షాలిని అని ముద్దుగా పిలుచుకునేవారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కథానాయికగా వెలుగొందుతున్న షాలిని 1997లో విడుదలైన అనియతి ప్రవు అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేసింది. తమిళ్‌లో విజయ్ సరసన 'కాదలుక్కు మరియాధై' చిత్రంతో షాలిని తెరంగేట్రం చేసింది.

తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన షాలిని తమిళంలో తన తదుపరి చిత్రంలో అజిత్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అజిత్‌, షాలినీ కలిసి నటించిన తొలి సినిమా ‘అమర్‌కాలం’. శరణ్‌ దర్శకుడు. 1999 ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. సినిమా విడుదలై విజయం సాధించడంతో వారి రొమాన్స్ కూడా అలాగే సాగింది. 

ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన సఖి చిత్రంతో ఈ జోడీ మరింత పాపులర్‌ అయింది. సినీరంగంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో అదే ఏడాదిలో అజిత్‌- షాలిని వివాహం చేసుకున్నారు.  అలా, 2001లో విడుదలైన ‘ప్రియద వరం వెండూమ్‌’ తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. బాలనటిగా దక్షిణాదిలో రాణించి ఆపై టాప్‌ హీరోయిన్‌ స్థాయికి షాలినీ చేరుకుంది. అయితే, గత రెండు దశాబ్దాలుగా సినిమాలకు దూరంగానే ఉంది.  

అలా సినిమా నుంచి తప్పుకున్న 23 ఏళ్ల తర్వాత కూడా శాలినికి సినిమా ఛాన్స్‌లు వచ్చాయి కానీ, సున్నితంగా వాటిని ఆమె తిరష్కరించింది. తన పిల్లలు అనుష్క (16), అద్విక్‌ (09) చదువు విషయంలో ఆమె ఎక్కువగా సమయం కేటాయిస్తుంది. తమిళంలో కేవలం 5 సినిమాల్లోనే షాలిని హీరోయిన్‌గా నటించినా.. ఆ కాలంలో రూ. 50 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది. అజిత్, షాలినీల ఆస్తుల విలువ ఏకంగా రూ.300 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే తిరుగులేని హీరోయిన్‌గా కొనసాగిన షాలిని చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు