Breaking News

100 అడుగుల లోయలో పడిపోయిన హీరోహీరోయిన్‌

Published on Mon, 11/03/2025 - 08:53

సినిమా షూటింగ్‌లో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆపదే అగరా షూటింగ్‌లో జరిగింది. ఎంపీ.నక్కీరన్‌, లిబియాశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కేరళలోని పాలక్కాడు అట్టప్పాడి ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ సీన్‌ చిత్రీకరస్తున్న సమయంలో హీరోహీరోయిన్లు కాలుజారి లోయలో పడిపోయారట! ఈ విషయాన్ని దర్శకుడు వెల్లడించాడు.

100 అడుగుల లోయలో..
జీవాభారతి మాట్లాడుతూ.. కేరళలోని అట్టప్పాడి కొండ ప్రాంతాల్లో హీరో హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాం. హీరోయిన్లు ఒకచోట నిలబడి మాట్లాడుకుంటున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా లిబియాశ్రీ కాలుజారి 100 అడుగుల లోయలోకి పడిపోయారు. ఆమెని కాపాడే ప్రయత్నంలో హీరో నక్కీరన్‌ కూడా లోయలోకి పడిపోయారు. ఓ పొడవైన తాడును తీసుకొచ్చి వారిని పైకి తీసుకొచ్చాం. వాళ్లు పడ్డ ప్రాంతం పచ్చికతో నిండి ఉండడంతో అదృష్టవశాత్తూ చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. లిబియాశ్రీ ప్రథమ చికిత్స అనంతరం మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు అని తెలిపాడు.

అగరా సినిమాను ఎంపీఎన్‌ మూవీస్‌ పతాకంపై ఎంపీ నక్కీరన్‌ నిర్మిస్తున్నారు. జీవాభారతి కథ, కథనం, మాటలు పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నిశాంత్‌, జీవాభారతి, కోవై డాక్టర్‌ కె.కన్నన్‌, రంగరాజన్‌ సుబ్బయ్య, సెంథిల్‌ తంగవేల్‌, రమేష్‌రాజా, ఆర్‌.ప్రభు, జి.గణేష్‌కుమార్‌, సెంథిల్‌కుమార్‌, ఇనియన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యూఎం.స్టీవెన్‌ సతీష్‌ సంగీతం, చాయాగ్రహణం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కోవై డాక్టర్‌ కె.కన్నన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)