Breaking News

పద్మ అవార్డు కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదు: నరేశ్‌

Published on Sun, 01/19/2025 - 13:38

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక పద్మ అవార్డులపై సినీ నటుడు నరేశ్‌ (VK Naresh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. 46 సినిమాలను డైరెక్ట్‌ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల (Vijaya Nirmala) అని, కానీ ఇంతవరకు తనకు పద్మ పురస్కారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మకు పద్మ అవార్డు రావాలని ఢిల్లీదాకా వెళ్లి ప్రయత్నించాను. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా గతంలో పద్మ పురస్కారం కోసం అమ్మ పేరును రికమండ్‌ చేశారు. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు.

పద్మ పురస్కారం కోసం పోరాడతా
బీజేపీ వచ్చిన తరువాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు పురస్కారాలు ఇస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ఎంజీఆర్ గారు బతికున్నప్పుడు పద్మ అవార్డు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు. మరణానంతరం ఇచ్చే పురస్కారంగా అయినా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అందుకు అర్హత కలిగిన వాళ్లు ఉన్నారు. మన వాళ్లకు పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా తప్పులేదు. మళ్లీ  ఇప్పటి నుంచి అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు.

చదవండి: దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)