అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
జైలర్ నటుడు అరెస్ట్.. కానిస్టేబుల్ను కొట్టడం వల్లే!
Published on Sat, 09/07/2024 - 20:03
సాక్షి, హైదరాబాద్: జైలర్ నటుడు వినాయకన్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామికా భద్రత దళం) కానిస్టేబుల్పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనపై స్పందించిన వినాయకన్ తానే తప్పూ చేయలేదంటున్నాడు. ఎయిర్పోర్టు అధికారులే తనను గదిలోకి తీసుకెళ్లి వేధించారంటున్నాడు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అసలు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయాడు. కాగా మలయాళ నటుడు వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. గతేడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తన వల్ల జైలుపాలయ్యాడు.
Tags : 1