Breaking News

భార్యకు విడాకులిచ్చిన వివాదాస్పద నటుడు

Published on Sun, 03/26/2023 - 16:39

ప్రముఖ మలయాళ నటుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ వినాయకన్‌ వివాహబంధానికి స్వస్తి పలికినట్లు వెల్లడించాడు. భార్య బబితకు విడాకులిచ్చినట్లు తెలిపాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆయన మాట్లాడుతూ.. 'నేను మలయాళ నటుడు వినాయకన్‌ను. నాకు, నా భార్యకు ఉన్న దాంపత్య బంధం ఇంతటితో ముగిసింది' అని చెప్పుకొచ్చాడు. 

కాగా గతేడాది మీటూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు వినాయకన్‌. ‘మీ టూ ఉద్యమం అంటే ఏమిటో నాకు తెలియదు. ఒక మహిళను నాతో శృంగారం చేస్తావా? అని అడగడం మీ టూ అయితే.. నేను దానిని అలాగే కొనసాగిస్తాను. నిజంగా అదే మీటూ అయితే తన జీవితంలో ఇప్పటి వరకు 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నాను' అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో క్షమాపణలు కోరాడు నటుడు. 2019లోనూ మృదులదేవి అనే దళిత మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాడు.

ఇకపోతే 1995లో వచ్చిన మోహన్‌లాల్‌ 'మాంత్రికం' చిత్రంతో నటుడిగా కెరీర్‌ ఆరంభించాడు. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించాడు. కమ్మటిపాదం సినిమాకు గానూ 2016లో కేరళ స్టేట్‌ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం అతడు పాన్‌ ఇండియా మూవీ జైలర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఆఖరిదశలో ఉంది. మలయాళంలో కరింతాండన్‌ చిత్రం చేస్తున్నాడు. తమిళంలో నటించిన ధృవ నక్షత్రం ఎన్నో ఏళ్ల తర్వాత రిలీజ్‌కు నోచుకుంటోంది. ఈ మూవీ మేలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Videos

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)