Breaking News

ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్‌

Published on Mon, 11/20/2023 - 06:34

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్‌ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్‌ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్‌ భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు.

ఈ పరిస్థితులలో విజయకాంత్‌ను చూడలేక పోతున్నామే అన్న ఆవేదనలో ఉన్న కేడర్‌కు ఇటీవల ఆయన దర్శనం కల్పించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకకు విజయకాంత్‌ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే విజయకాంత్‌ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నగరంలోని ఓ ఆస్పత్రికి ఆదివారం తరలించారు. ఆయనకు ఆస్పత్రిలో పరిశోధనలు, చికిత్సలు కొనసాగుతున్నాయి. విజయకాంత్‌ ఆస్పత్రిలో చేరిన సమాచారంతో డీఎండీకే వర్గాలలో ఆందోళన నెలకొంది.

అదే సమయంలో వదంతులు, ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇందుకు ముగింపు పలికే విధంగా డీఎండీకే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్‌కు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు వివరించారు. ఆయన రెండు రోజులలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్‌కు భరోసా ఇచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)