Breaking News

విజయ్‌ రాజకీయ పార్టీకి గుడ్‌న్యూస్‌.. అభిమానుల్లో ఉత్సాహం

Published on Sun, 09/08/2024 - 14:36

దళపతిగా కోలీవుడ్‌లో చెరగని ముద్ర వేసిన విజయ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'తమిళగ వెట్రి కళగం' (TVK) పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి సంబంధించి జెండాతో పాటు గుర్తును కూడా ఆవిష్కరించారు.ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ పువ్వును విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాడు విజయ్.

విజయ్‌కి ఎన్నికల సంఘం నుంచి శుభవార్త వచ్చింది. తమ పార్టీకి గుర్తింపు ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా విజయ్‌ తెలిపారు. ఎన్నికల సంఘం ప్రకటనతో తన రాజకీయ పార్టీకి గుర్తింపు రావడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడును అభివృద్ధి పథంలో  ముందుకు తీసుకెళ్లడమే తమ పార్టీ లక్ష్యమని విజయ్‌ పేర్కొన్నారు. త్వరలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ కార్యచరణ గురించి వెళ్లడిస్తామని అన్నారు. ఈ క్రమంలో తమిళనాడు  విల్లుపురం వేదికగా  TVK పార్టీ తొలి భారీ బహిరంగ సభకు పోలీసుల నుంచి అనుమతి వచ్చింది.  21 నిబంధనలతో సభకు అనుమతి లభించింది. దీంతో ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విజయ్‌ రాజకీయ పార్టీని ప్రకటించారు. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ముందే ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏ ఇతర రాజకీయ పార్టీలకు కూడా తన మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో తప్పకుండా దిగుతామని విజయ్‌ పేర్కొన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేస్తారా..? లేదా పొత్తుల సాయంతో ముందుకొస్తారా..? అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)