Breaking News

లైఫ్‌లో చాలా డిస్టర్బ్‌ అయ్యా.. ఆ గుడికి వెళ్లాక జీవితమే మారింది: వెంకటేష్‌

Published on Sun, 12/29/2024 - 12:18

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు విక్టరీ వెంకటేష్‌. అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న  ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. సరికొత్తగా ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రారంభించింది. ఈ క్రమంలో బాలకృష్ణతో వెంకటేష్‌ ఒక వేదికపై మెరిశారు. సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్న వెంకీ తన జీవితంలో బాగా డిస్ట్రబ్‌ అయిన సమయంలో 'అరుణాచలం' ఆలయాన్ని సందర్శించాక ఏం జరిగిందో పంచుకున్నారు.

అరుణాచలం ఆలయం సందర్శించిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని వెంకటేష్‌ ఇలా పంచుకున్నారు. 'ప్రపంచంలో  చాలా ప్రదేశాలు తిరిగాను. ఈ క్రమంలో చాలామందిని కలిశాను. ఈ క్రమంలో జీవితంలో కూడా చాలా డిస్ట్రబ్‌ అయ్యాను కూడా. ఫైనల్లీ అరుణాచలం వెళ్లి స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్‌ చేశాను. అక్కడ ఏదో తెలియని శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అసలైన హ్యూమన్‌ ఎనర్జీ ఎంటో అక్కడే తెలుస్తోంది. 

నేను అలాంటి శక్తిని అక్కడి నుంచే పొందాను. ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నున్ను డిస్ట్రబ్‌ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వెంకీలోని మార్పులు అరుణాచలం నుంచి వచ్చినవే. ఎక్కడ దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుంది. అలానే నేను అన్నది మర్చిపోయి , ఏది శాశ్వతము కాదు అని తెలుసుకుంటాము ' అని ఆయన భక్తితో ఎమోషనల్‌గా చెప్పారు.  అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

అరుణాచలం గుడి గురించి ఈ విషయం తెలుసా..?
తమిళనాడులో తిరువణ్ణామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన  అరుణాచలేశ్వరాలయం ఉంటుంది. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్లు ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తుంటారు. అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు... ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివుడు అగ్నిలింగంగా అక్కడ అవతరించాడు. పంచ భూత పవిత్ర స్థలాల్లో ఒకటిగానూ ప్రపంచంలోని అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగానూ పేరుంది. అరుణాచలంలో  పరమశివుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు వెళ్తారు. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు అక్కడకు భక్తులు భారీగా చేరుకుంటారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)