Breaking News

స్టార్ కమెడియన్ రూ.5 కోట్ల పరువు నష్టం దావా

Published on Fri, 08/23/2024 - 11:48

ప్రముఖ కమెడియన్, పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో మనకు తెలిసిన వడివేలు.. తోటి నటుడు సింగముత్తపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఈ మేరకు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 1991 నుంచి సినిమాల్లో నటిస్తూ ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగానని, సింగముత్తుతో కలిసి 2000 నుంచి కొన్ని సినిమాల్లో కలిసి నటించానని.. కానీ తాను అతడి కంటే ఉన్నత స్థాయికి ఎదగడంతో సింగముత్తు తట్టుకోలేకపోతున్నాడని వడివేలు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో)

ఆ మధ్య తాంబరంలో వివాదాస్పద స్థలాన్ని సింగముత్తు తనతో కొనిపించాడని, ఆ కేసు స్థానిక ఎగ్మోర్ కోర్ట్‪‌లో ఉందని వడివేలు చెప్పుకొచ్చారు. గత జనవరి నుంచి మార్చి మధ్యలో పలు యూట్యూబ్ ఛానెళ్లలో కనిపించిన సింగముత్తు.. తనని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని, తన పరువుకు భంగం కలిగించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. దీనికోసం ఆయన రూ.5 కోట్ల పరువు నష్టం దావా చెల్లించేలా చేయాలని కోర్టుకి విన్నవించాడు.

ఇక వడివేలు పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన జడ్జి.. రెండు వారాల్లో బదులివ్వాలని నటుడు సింగముత్తుకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కాస్త తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)