వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్
Breaking News
ఆస్పత్రిలో నటుడు ఉపేంద్ర.. ఏమైందంటే?
Published on Tue, 05/06/2025 - 14:15
కన్నడతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర(Upendra). రీసెంట్ టైంలో మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈయన ఆస్పత్రి పాలయ్యారని, అనారోగ్యం(Health Update) అని వార్తలు వచ్చాయి. ఇప్పుడీ ఈ విషయమై స్వయంగా ఈయనే క్లారిటీ ఇచ్చేశాడు.
(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)
'అందరికీ నమస్కారం. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సాధారణ చెకప్ కోసమే మాత్రమే ఆస్పత్రికి వెళ్లొచ్చాను. ఇలాంటి పుకార్లతో అయోమయానికి గురవ్వొద్దు. మీ ప్రేమకు ధన్యవాదాలు' అని ఉపేంద్ర ట్వీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు.
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎవరు ఆస్పత్రికి వెళ్లినా సరే అనారోగ్య సమస్యలు, పరిస్థితి విషమం తరహా వార్తలు వస్తున్నాయి. దీంతో సదరు నటీనటులు తప్పని పరిస్థితుల్లో ట్వీట్, పోస్ట్ ద్వారా స్పష్టత ఇవ్వాల్సి వస్తోంది. ఉపేంద్ర.. తెలుగులో రామ్(Ram Pothineni) హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడని అంటున్నారు.
(ఇదీ చదవండి: శుభవార్త చెప్పిన 'వరుణ్ తేజ్, లావణ్య')
ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ.. ನಾನು ಆರೋಗ್ಯವಾಗಿದ್ದೇನೆ.. ರೆಗ್ಯುಲರ್ ಚೆಕ್ ಅಪ್ ಗಾಗಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿದ್ದೆ ಅಷ್ಟೇ.. ಯಾವುದೇ ಊಹಾ ಪೋಹ ಗಳಿಗೆ ಕಿವಿಕೊಟ್ಟು ಗೊಂದಲಕ್ಕಿಡಾಗಬೇಡಿ.. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಕಾಳಜಿಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು 🙏
— Upendra (@nimmaupendra) May 5, 2025
Tags : 1