Breaking News

రూ.25 లక్షల కోసం వెళ్లి మర్డర్‌ కేసులో ఇరుక్కున్నా: సై సూర్య

Published on Thu, 10/12/2023 - 16:55

ఎన్నో సినిమాలు చేస్తే కానీ కొందరికి గుర్తింపు లభించదు. మరికొందరికి మాత్రం తొలి చిత్రంతోనే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నటుడు సూర్య రెండో కోవలోకి వస్తాడు. ఇతడు రాజమౌళి సై సినిమాతో నటుడిగా క్లిక్‌ అయ్యాడు. ఆ నలుగురు చిత్రంతో పాటు పలు హిట్‌ సినిమాల్లో నటించాడు. ఆ మధ్య ఓ హత్య కేసులోనూ అతడి పేరు వినిపించడంతో మానసికంగా చాలా డిస్టర్బ్‌ అయ్యాడు.

పాతిక లక్షల కోసం వెళ్లి..
తాజాగా సదరు ఘటన గురించి సూర్యంగా వివరంగా చెప్పుకొచ్చాడు. 'నేను కలియుగ అనే సినిమా తీశాను. దానికోసం నా దగ్గరున్న డబ్బులన్నీ పెట్టేశాను. రిలీజ్‌కు రూ.25 లక్షలు అవసరమయ్యాయి. ఓ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రాకేశ్‌ రెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేశాడు. అతడు చిన్న చిన్న సినిమాలకు డబ్బు అప్పుగా ఇస్తుంటాడు. నా సినిమా చూపించి డబ్బు అడిగాను. ఇక్కడేమైందంటే డబ్బులు అవసరమై చిగురుపాటి జయరాం అనే వ్యక్తిని కూడా కలిశాను.

ఆ మరునాడే హత్య.. మీడియాలో నా పేరు
పది రోజుల్లో డబ్బు సర్దుతానన్నాడు, సరేనని అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ మరునాడే ఆయన హత్య జరిగింది. ముందు రోజు నేను ఆయనను కలవడంతో నామీద అనుమానపడ్డారు. సినిమా వాళ్ల గురించి ఎలా రాస్తారో తెలిసిందే! ఆ హత్యతో నాకసలు సంబంధమే లేదని రుజువైంది. కానీ అప్పటికే మీడియాలో నా గురించి ఏదిపడితే అది రాశారు. చాలా ఇబ్బందులు పడ్డాను. ఇకపోతే కలియుగ సినిమా కోసం నా ఇల్లు కూడా ఇమ్మేశాను. ఈ మూవీ వచ్చే నెలలో ఓటీటీలోకి రాబోతోంది' అని చెప్పుకొచ్చాడు సూర్య.

చదవండి: మహాలక్ష్మిని, నన్ను ఎవరూ వేరు చేయలేరు.. ఎంతైనా తిట్టుకోండి..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)