Breaking News

కూతురుతో హైదరాబాద్‌కు సూర్య.. యంగ్ లుక్ వైరల్!

Published on Tue, 06/10/2025 - 14:08

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది 50 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్నప్పటికీ, చూడటానికి 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వయసుతో పాటు ఆయన అందం కూడా పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ మరింత ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా, సూర్య తన కూతురు దియాతో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో సూర్య, దియా తండ్రి-కూతుళ్లలా కాకుండా అన్నా-చెల్లెల్లా కనిపించారు. సూర్య యంగ్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతూ, ‘మా హీరో రోజురోజుకూ మరింత యంగ్‌గా మారుతున్నాడు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వీడియోని షేర్ చేస్తున్నారు.

సూర్య ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి ఆధ్వర్యంలో కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన కూతురు దియాని కూడా వెంటబెట్టుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో టీషర్ట్‌లో సింపుల్‌గా కనిపించిన సూర్య, తన ఫిట్‌నెస్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.

సూర్య కూతురు దియా సాధారణంగా పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించదు. ఆమెకు సంబంధించిన వివరాలు కూడా పెద్దగా బయటకు రాలేదు. ఇటీవల దియా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, ఆ ఫోటోలను సూర్య భార్య జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. చదువు పూర్తి చేసిన దియా ఇప్పటి వరకు సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. అయితే, తండ్రితో కలిసి షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం ఆసక్తికరంగా మారింది. ఎయిర్‌పోర్ట్‌లో సూర్య, దియా కలిసి నడుచుకుంటూ వెళ్లిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్య ఫిట్‌నెస్, యంగ్ లుక్‌కు అభిమానులు మరోసారి ఆకర్షితులవుతూ, అతడి స్టైల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)