Breaking News

జర్నలిస్ట్‌తో ప్రముఖ నటుడి అసభ్య ప్రవర్తన.. ఆపై క్షమాపణ చెబుతూ ట్వీట్‌

Published on Sat, 10/28/2023 - 18:47

సురేష్‌ గోపీ భారతీయ సినీ నటుడు, మాజీ ఎంపీ, గాయకుడు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించాడు. కేరళలోని కోజికోడ్‌లో శుక్రవారం నాడు జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తూ మహిళా విలేకరి భుజంపై రెండుసార్లు చేయి వేసి ఆమెతో సంభాషించడంపై వివాదం చెలరేగింది. మొదట మహిళా విలేకరికి సమాధానం చెబుతూ.. ఆమె భుజంపై చెయ్యి వేశారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందిపడిన ఆమె కాస్త దూరం జరిగింది.

(ఇదీ చదవండి: క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్‌ ఛాన్స్‌)

కొంత సమయం తర్వాత ఆమె మరో ప్రశ్న అడిగేందుకు ముందుకు రాగా.. ఆయన మరోసారి ఆమెను అదే విధంగా తాకారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ఈ ఘటనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాజీ ఎంపీ సురేష్ గోపి నేడు సదరు జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు.

ఓ మహిళా జర్నలిస్ట్‌తో ఆయన ప్రవర్తించిన తీరు దేశం అంతటా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ చేశారు. ' ఆమెను నేనొక కుమార్తెగా భావించా. ఆ ఆప్యాయతతోనే భుజంపై చెయ్యి వేశా. ఈ ఘటన పట్ల ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. నా ప్రవర్తన వల్ల ఆమె ఇబ్బందిపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నా.' అని ఆయన తెలిపారు. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)