Breaking News

విషమంగా హీరో సుమన్‌ ఆరోగ్యం?!.. క్లారిటీ ఇచ్చిన నటుడు

Published on Wed, 08/31/2022 - 15:00

సినీ నటుడు, అలనాటి హీరో సుమన్‌ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొద్ది రోజులుగా పలు యూట్యూబ్‌ చానళ్లో వీడియో దర్శనిమిస్తున్నాయి. ఇక పలు ఉత్తరాది యూట్యూబ్‌ చానల్స్‌ అయితే ఏకంగా ఆయన ఇకలేరంటూ వీడియోలతో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్‌ అంతా షాకయ్యారు. అదేంటి ఆకస్మాత్తుగా ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడం ఏంటని, ఇది నిజమా? కాదా? అంటూ తెలుగు రాష్ట్రాల అభిమానులంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుమన్‌ ఈ వార్తలపై స్పందించారు.

చదవండి: వెండితెరపై వినాయక విన్యాసాలు.. ఈ సినిమాలపై ఓ లుక్కేయండి

తాను పూర్తి ఆరోగ్యం ఉన్నానని, తన గురించి, తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తమిళ మీడియా ద్వారా ఆయన ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పట్ల వస్తున్న పూకార్లపై ఆయన మండిపడ్డారు. ‘నేను పూర్తి ఆరోగ్యం ఉన్నా. సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం బెంగళూరులో నా సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఈ క్రమంలో నా ఆరోగ్యంపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నా సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది. అందుకే ఇలా నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది’ అని సుమన్‌ అన్నారు.

చదవండి: హీరోయిన్‌ అమలాపాల్‌కు లైంగిక వేధింపులు!

అనంతరం తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసిన సదరు యూట్యూబ్‌ చానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ సుమన్‌ ధ్వజమెత్తారు. కాగా నాలుగు దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలుగు, తమిళంలో హీరోగా, సహానటుడిగా ఎన్నో సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన  మలయాళం, కన్నడలో సైతం పలు చిత్రాల్లో నటించారు. తన సినీ కెరీర్‌లో సుమన్‌ దాదాపు 150పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఐక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపించనున్నారు.

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)