Breaking News

జైలు నుంచి విడుదలైన నటులు శ్రీరామ్, కృష్ణ

Published on Fri, 07/11/2025 - 07:43

మత్తుపదార్థాల కేసులో అరెస్ట్అయిన కోలీవుడ్నటులు శ్రీరామ్, కృష్ణ విడుదలయ్యారు. మాదక ద్రవ్యాల వాడిని కేసులో నటుడు శ్రీరామ్‌ (తమిళంలో శ్రీకాంత్‌) ను పోలీసులు గత నెల 23వ తేదీన అరెస్ట్‌ చేసి పుళల్‌ జైలుకు తరలించిన విషయం, అదే కేసులో మరో నటుడు కృష్ణ ను గత నెల 26వ తేదీన అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన ఈ నటులు బెయిల్‌ కోసం చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

అయితే ఆ కోర్టు వీరి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో శ్రీరామ్, కృష్ణ తరుపు న్యాయవాదులు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం శ్రీరామ్, కృష్ణకు రెండు రోజుల క్రితం నిబంధనలతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రతులను న్యాయవాదులు జైలు అధికారులకు అందించారు. అనంతరం ప్రొసీజర్స్‌ పూర్తి చేసిన జైలు అధికారులు నటులు శ్రీరామ్, కృష్ణను విడుదల చేశారు.

తప్పు చేశాను.. నా కుమారుడిని చూసుకోవాలి
డ్రగ్స్‌ ఉపయోగించి తప్పు చేశానని కోర్టులోనే శ్రీరామ్ఒప్పుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్‌ తనకు మత్తుపదార్థాలను అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీరామ్తెలిపారు. ఆయన నిర్మాణంలో ‘తీంగిరై’ అనే సినిమాలో నటించానని, ప్రాజెక్ట్కు సంబంధించి తనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో డబ్బు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్‌ ఇచ్చేవారని పేర్కొన్నారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి తానే అడిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసులకు శ్రీరామ్‌ వెల్లడించారు. అయితే, తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని అందుకు బెయిల్‌ మంజూరు చేయాలని శ్రీరామ్కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్న్యాయస్థానం మంజూరు చేసింది.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)