Breaking News

ఆ యూట్యూబర్‌పై శివ బాలాజీ ఫిర్యాదు

Published on Sun, 09/08/2024 - 14:56

చిత్రపరిశ్రమలోని  నటీనటులతో పాటు వారి కుటుంబసభ్యులను టార్గెట్‌ చేస్తూ వ్యక్తిగతంగా ట్రోల్స్‌ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మా అధ్యక్షులు మంచు విష్ణు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు,  'మా' కోశాధికారి శివ బాలాజీ పోలీసులను ఆశ్రయించారు.

సినీ నటీనటులను టార్గెట్‌ చేస్తూ నిత్యం నెగెటివ్‌ ట్రోల్స్‌ చేస్తున్న యూట్యూబర్‌ విజయ్‌ చంద్రహాసన్‌ అనే వ్యక్తిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌లో  శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. చంద్రహాసన్‌ గత కొంత కాలంగా నటీనటులతో పాటు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి తప్పుగా చూపుతూ.. ట్రోల్స్‌ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

చిత్రపరిశ్రమలో భాగమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషషన్‌కు ఉన్న   గౌరవాన్ని దెబ్బతీసేలా పలు వీడియోలు క్రియేట్‌ చేశాడని శివ బాలాజీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్‌కు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం సుమారు 18కి పైగా యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. యూట్యూబర్స్‌లో మార్పు రాకుంటే వారిపై మరింత కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)