Breaking News

'పుష్ప'లో అల్లు అర్జున్‌కు డబ్బింగ్‌ చెప్పిన నటుడికి గుండెజబ్బు

Published on Fri, 12/15/2023 - 11:02

బాలీవుడ్‌ నటుడు శ్రేయాస్‌ తల్పడే (47) అస్వస్థతకు లోనయ్యాడు. గురువారం సాయంత్రం ఆయనకు గుండెలో నొప్పి రావడంతో ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో యాంజియోప్లాస్టీ చేశారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం అయిందని, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని వైద్యులు పేర్కొన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో తనను డిశ్చార్జి చేస్తామని తెలిపారు.

సీరియల్స్‌ నుంచి సినిమాకు..
కాగా శ్రేయాస్‌ తల్పడే గురువారం నాడు 'వెల్‌కమ్‌ టు జంగల్‌' సినిమా షూటింగ్‌ ముగించుకున్న తర్వాత అలసటకు లోనయ్యాడు. ఇంతలోనే గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించారు. ఇదిలా ఉంటే శ్రేయాస్‌ తల్పడే మరాఠీ సీరియల్స్‌తో తన కెరీర్‌ ప్రారంభించాడు. ఆంఖెన్‌ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. 2005లో వచ్చిన ఇక్బాల్‌ సినిమాతో విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విజయం తర్వాత మరిన్ని హిట్‌ మూవీస్‌లో నటించాడు.

పుష్పరాజ్‌ హిందీ వాయిస్‌ ఇతడిదే
ఓం శాంతి ఓం, గోల్‌మాల్‌ రిటర్న్స్‌, హౌస్‌ఫుల్‌ 2 తదితర చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. చివరగా కౌన్‌ ప్రవీణ్‌ తాంబే(ప్రవీణ్‌ తాంబే ఎవరు?) సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడు మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే వెల్‌కమ్‌ టు ద జంగిల్‌ సినిమాలోనూ భాగమయ్యాడు. శ్రేయాస్‌ తల్పడే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ సేవలందిస్తున్నాడు. పుష్ప సినిమా హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పాడు. పుష్ప 2లోనూ బన్నీకి ఇతడు గొంతు అరువివ్వనున్నాడు.

చదవండి: అమర్‌ను మళ్లీ టార్గెట్‌ చేసిన శివాజీ.. వెధవ.. ఏం రోగమంటూ..

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)