Breaking News

కోట శ్రీనివాసరావుకు గొంతు అరువిచ్చిన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ మృతి

Published on Sat, 02/18/2023 - 10:05

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షానవాజ్‌ ప్రధాన్‌(56) గుండెపోటుతో మరణించారు. ముంబైలో శుక్రవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో షానవాజ్‌ ఛాతీలో నొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను కోకిలాబెన్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అవార్డుల ఫంక్షన్‌ కార్యక్రమంలో పాల్గొన్న లగాన్‌ నటుడు యశ్‌పాల్‌ శర్మ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. 'ముంబైలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాను. వందలాది మంది ఆర్టిస్టులతో ప్రాంగణం కళకళలాడుతోంది. ఇంతలో అవార్డు అందుకున్న షానవాజ్‌ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ప్రోగ్రాం నిలిపివేసి ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ బతికించుకోలేకపోయాం. అందరి కళ్ల ముందే ఆయన ప్రాణాలు వదిలారు' అని భావోద్వేగానికి లోనయ్యాడు.

కాగా షానవాజ్‌.. 'అలిఫ్‌ లైలా', 'హరి మర్చి లాల్‌ మిర్చి', 'బంధన్‌ సాత్‌ జన్మోన్‌ కా' సహా పలు సీరియల్స్‌లో నటించారు. 'ప్యార్‌ కోయ్‌ ఖేల్‌ నహీ', 'ఫాంటమ్‌', 'రేస్‌' వంటి చిత్రాల్లోనూ యాక్ట్‌ చేశారు. 'బెటర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌', 'మీర్జాపూర్‌', 'హోస్టేజెస్‌' వంటి వెబ్‌సిరీస్‌లో కూడా ఆయన పలు పాత్రలు పోషించారు. అంతే కాకుండా 'దూకుడు', 'బృందావనం', 'అతడు', 'జులాయి', 'రేసు గుర్రం', 'రచ్చ', 'ఛత్రపతి', 'మున్నా' సహా ఎన్నో తెలుగు సినిమాలకు, ఫారిన్‌ సినిమాలకు హిందీ డబ్బింగ్‌ చెప్పారు. ఎక్కువగా కోట శ్రీనివాసరావుకు ఆయన హిందీ వర్షన్‌లో డబ్బింగ్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

చదవండి: కమెడియన్‌ గీతాసింగ్‌ ఇంట తీవ్ర విషాదం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)