Breaking News

నటుడు సత్యరాజ్‌ కుమార్తెకు కీలక పదవి

Published on Mon, 02/17/2025 - 06:52

సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడ్డ సత్యరాజ్‌ తనయ దివ్య సత్యరాజ్‌ కొద్దిరోజుల క్రితమే డీఎంకే పార్టీలో చేరారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆమెకు కీలక  పదవి అప్పగించారు. ఆ పార్టీ అనుబంధ ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌ ప్రకటించారు. సినీ నటుడు సత్యరాజ్‌ తనయుడు సీబీ రాజ్‌ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే. 

ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్‌ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. గతకొంత కాలంగా రాజకీయాల్లో రావాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చిన ఆయన కుమార్తె దివ్య గత నెలలో డీఎంకేలో చేరారు. సీఎం స్టాలిన్‌ సమక్షంలో డీఎంకే సభ్యత్వం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం డీఎంకేలో పలు జిల్లాలకు కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, అనుబంధ విభాగాలకు కొత్త వారి నియామకం వేగం పుంజుకుంది. ఆ దిశగా ఆదివారం ఐటీ విభాగంలో పదవులను భర్తీ చేశారు. 

ఇందులో దివ్యకు ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శి పదవి అప్పగించారు. అలాగే డీఎంకే అనుబంధ మైనారిటీ విభాగం, వర్తక తదితర విభాగాలతో పాటూ మరికొన్ని విభాగాల పదవులను భర్తీ చేస్తూ దురై మురుగన్‌ ప్రకటించారు. అలాగే పార్టీ ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడిగా ముబారక్‌ను నియమించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)