Breaking News

డైరెక్టర్‌గా జబర్దస్త్ కమెడియన్.. 'ప్రతి సీన్‌ మనసును కదిలిస్తుంది'!

Published on Wed, 07/19/2023 - 19:38

సాయికుమార్‌, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ సాయి, దీపాలి రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నాతో నేను’. శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మించారు. ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది.  ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు సాయి కుమార్ హాజరయ్యారు. 

(ఇది చదవండి: స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?)

సాయికుమార్‌ మాట్లాడుతూ.. 'నాన్న అమ్మ ఇచ్చిన స్వరం, సంస్కారంతో నేను ఈ స్థాయిలో ఉన్నా. చక్కని కథలతో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా నిలబడ్డా. మనసును కదిలించే కథతో సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో ప్రతి సీన్‌ మనసును కదిలిస్తుంది.' అని అన్నారు. శ్రీనివాస్‌ సాయి మాట్లాడుతూ..' చక్కని కథాంశంతో ఎమోషన్స్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. టీమ్‌ అంతా కష్టపడ్డాం. చిన్న సినిమానే కావచ్చు కానీ మంచి ప్రయత్నం.' అని అన్నారు. 

శాంతికుమార్‌ మాట్లాడుతూ.. 'జబర్దస్త్‌ కమెడియన్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందా. నేను దర్శకత్వం వహించే వరకూ వచ్చానంటే నిర్మాతలే కారణం. కథ అన్ని ఓకే అయ్యాక సీనియర్‌ ఆర్టిస్ట్‌ సాయికుమార్‌ సరే అనగానే నేను సక్సెస్‌ అయ్యాననిపించింది. అన్ని రకాలుగా సహకరించిన నిర్మాతకు కృతజ్ఞతలు.' అని అన్నారు. కరోనా వల్ల కాస్త  ఆలస్యమైనా మంచి సమయంలో విడుదల చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాత అన్నారు. ఈ  చిత్రంలో సమీర్, సీవీఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 

(ఇది చదవండి: బిగ్‌బాస్‌లోకి ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ .. స్టార్‌ మా ప్లాన్‌ ఇదేనా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)