Breaking News

గుడ్‌న్యూస్‌ చెప్పిన 'కోయిలమ్మ' జంట

Published on Tue, 10/07/2025 - 11:45

టాలీవుడ్‌ నటుడు సాయికిరణ్‌ తండ్రి కాబోతున్నాడు. ఇదే విషయాన్ని చెబుతూ సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్‌ చేశాడు. తెలుగులో 'నువ్వే కావాలి', 'ప్రేమించు' సినిమాల్లో నటించిన సాయికిరణ్.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌తో బిజీగా ఉన్నాడు. 'కోయిలమ్మ', 'గుప్పెడంత మనసు' తదితర సీరియల్స్‌తో బుల్లితెరపై మరింత గుర్తింపు పొందాడు. అయితే, గతేడాది డిసెంబర్‌లో తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

సాయికిరణ్‌, స్రవంతి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడంతో వారి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. దిగ్గజ గాయని పి.సుశీలకు.. సాయికిరణ్ మనవడు వరస అవుతాడు. ఇతడి తండ్రి కూడా సింగర్‌గా గుర్తింపు  పొందాడు. అలా ఇండస్ట్రీ వాతావారణంలోనే పెరగడంతో 'నువ్వే కావాలి' మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు ఓ పాప కూడా ఉంది. కానీ, కొన్ని మనస్పర్థలు కారణంగా కొన్నాళ్ల క్రితమే సాయికిరణ్-వైష్ణవి విడాకులు తీసుకున్నారు. 

కొంతకాలం పాటు ఒంటరిగానే ఉన్న సాయికిరణ్. తనతోపాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో ప్రేమలో పడ్డాడు. అలా వారిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు వారిద్దరూ శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్‌ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)