Breaking News

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

Published on Sun, 04/28/2024 - 12:06

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ని  ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు?  

బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌, ఇన్ఫ్లూయెన్సర్‌గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్‪‌ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్‌కి నోటీసులు జారీ చేశారు.

(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)

అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్‌లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.

(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)