Breaking News

ప్రతి రోజు రాత్రి నా భార్య కాళ్లు మొక్కిన తర్వాతే నిద్రపోతా: నటుడు

Published on Tue, 07/22/2025 - 17:09

పేరుకే ఆడమగ సమానం అని చెప్పినప్పటికీ, సమాజంలో చాలా చోట్ల ఇప్పటికీ పురుషాధిక్యత కొనసాగుతోంది. కొన్ని పనులు, ముఖ్యంగా గృహసంబంధిత బాధ్యతలు, సంతాన సంరక్షణ వంటివి స్త్రీలు మాత్రమే చేయాలనే సాంప్రదాయ ఆలోచనలు ఇంకా బలంగా ఉన్నాయి. సంప్రదాయం పేరుతో వారిని అణచివేసే కార్యక్రమాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక నటుడు మాత్రం స్త్రీలను గౌరవించాలని మాటలు మాత్రమే చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నాడు. ప్రతి రోజు రాత్రి తన సతీమణి పాదాలకు నమస్కరించిన తర్వాతే నిద్ర పోతాడట. తన కష్టసమయాల్లో తోడుగా నిలిచిన సతీమణికి ఇలా పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని గర్వంగా చెబుతున్నాడు

ఆ నటుడు మరెవరో కాదు..‘రేసుగుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రవి కిషన్(Ravi Kishan)‌. తాజాగా ఆయన సినిమా ప్రమోషన్కోసం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’లో పాల్గొన్నాడు. సందర్భంగా హోస్ట్కపిల్శర్మ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ‘రవి ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు భార్య ప్రీతి కిషన్‌ పాదాలను నమస్కారం చేస్తాడుఅని చెప్పగా.. దీనికి రవి నవ్వుతూ అంగీకరించాడు.

మీరు చెప్పింది నిజమే. ప్రతి రోజు రాత్రి నా భార్య పాదాలకు నమస్కారం చేస్తా. ఆమెకు ఇలా చేయడం నచ్చదు. అందుకే నిద్రపోయిన తర్వాత ఆమె పాదాలను తాకుతా. నా జీవితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా భార్య ఎంతగానే అండగా నిలిచింది. డబ్బు, పలుకుబడి లేనప్పుడు కూడా నా పక్కనే నిలబడింది. ఇప్పుడు నేను స్థానంలో ఉన్నానంటే కారణం నా భార్య మాత్రమే. అంత చేసిన ఆమెకు నేను ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలను. అందుకే కనీసం పాదాలను తాయి అయినా కృతజ్ఞతతలు తెలపాలనుకున్నాఅని రవి కిషన్ఎమోషనల్అయ్యాడు.  రవి కిషన్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం, ఆమె పట్ల చూపే గౌరవాన్ని చాటడం అందరినీ ఆకట్టుకుంది.

కాగా, రవి, ప్రీతిల వివాహం 1993లో జరిగింది. వీరికి నలుగురు సంతానం. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయంగానే దూసుకెళ్తున్నాడు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. రేసుగుర్రం సినిమాలో విలన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయయ్యాడు. బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్‌ సినిమాలోనూ కీలక పాత్ర పోషించాడు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)